Yash: హీరో యాష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఈ నటుడు కేజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించాడు. యాష్ కి మాత్రమే కాదు కన్నడ ఫిలిం ఇండస్ట్రీకే “కేజిఎఫ్” అద్భుతమైన గుర్తింపు తీసుకొచ్చింది. కేజిఎఫ్ రాకముందు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ కేవలం చిన్న బడ్జెట్ సినిమాలు చేసే ఇండస్ట్రీ అనే నానుడు ఉండేది. అటువంటి ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వందల కోట్ల బడ్జెట్ తో “కేజిఎఫ్” తీసి అద్భుతమైన విజయం సాధించి సినిమా ప్రపంచాన్ని కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు. కేజిఎఫ్ మొదటి భాగం ఎంతటి విజయం సాధించిందో అదే రీతిలో రెండో భాగం దానికి రెట్టింపుగా విజయం సాధించింది.
“కేజిఎఫ్ 2” ఏకంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ₹1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించడం జరిగింది. హీరో యాష్ యాక్షన్ సన్నివేశాలలో చూపించిన పెర్ఫార్మెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు హీరో యాష్ నటనకు ఫుల్ ఫిదా అయిపోయారు. మామూలుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలకు ముంబైలో కటౌట్లు కట్టడం సర్వసాధారణం. కానీ హీరో యాష్ నటించిన కేజిఎఫ్ 2 విడుదల సందర్భంగా ముంబైలో దాదాపు కొన్ని వందల అడుగుల కటౌట్ బాలీవుడ్ ప్రేక్షకులు కట్టి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాతో యాష్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
ఇటువంటి తరుణంలో యాష్ తర్వాత సినిమా కోసం ప్రేక్షకులంతా ఎదురుచూస్తూ ఉన్నారు. “Yash 19” వర్కింగ్ టైటిల్ తో రానున్న కొత్త సినిమా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా యాష్ హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీతో కలసి ఒరిజినల్ గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేయడం సంచలనంగా మారింది. ఈ గన్ షూటింగ్ కి సంబంధించిన వీడియో యాష్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఇందులో నెక్స్ట్ టైం ఇది కళాష్.. నికావో సీన్ అవుతుంది అంటూ కామెంట్ పెట్టడం జరిగింది. దీంతో యాష్ తన తర్వాత సినిమాలో ఫుల్ యాక్షన్ సన్నివేశాలలో నటిస్తున్నట్లు అర్థమవుతుంది.