సినిమా

Yash: రాఖీ భాయ్‌ కూతురా మజాకా.. పుత్రికోత్సాహంతో పొంగిపోతున్న యష్!

Share

Yash: కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌ గురించి ఇపుడు యావత్ భారతదేశం అంతటా తెలుసు. కేజీయఫ్‌ 2 సక్సెస్‌తో గురుడు మంచి ఖుషిగా వున్నాడు. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీయఫ్‌ 2 బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 1000కోట్లు కలెక్షన్స్‌ రాబట్టింది. ఒక్క బాలీవుడ్‌లోనే ఈ మూవీ రూ. 350 కోట్లు వసూళ్లు చేసి, బి టౌన్ లో గుబులు పుట్టిస్తోంది. దక్షిణాది సినిమా ఆల్‌ టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేయడం ఇది నాల్గవ సారి. బాహుబలి 1, బాహుబలి 2, RRR, ఇపుడు KGF సినిమా బాలీవుడ్లో సౌత్ సత్తా చాటాయి. ఇక ఈ మూవీ యశ్‌ కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Yash overflowing with daughter's enthusiasm!
Yash overflowing with daughter’s enthusiasm!

Yash: రాఖీ భాయ్‌ కూతురు ఇరా పాడిన పాట ఇదే

ఇక కేజీయఫ్‌ 2 షూటింగ్‌తో దాదాపు 5 సంవత్సరాలు ఫుల్‌ బిజీగా ఉన్న యశ్‌ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలిడేని ఎంజాయ్ చేస్తున్నాడు. యశ్‌ మహేష్ బాబులానే మంచి ఫ్యామిలీ మ్యాన్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. ఖాళీ దొరికితే తన కుటుంబంతో కలిసి టూర్లకు, వెకేషన్స్‌కు వెళతాడు. ఈ క్రమంలో కూతురు ఐరాతో యశ్‌ తన డేను స్టార్ట్‌ చేశాడు. ఉదయం లేవగానే ఐరాతో ఆడుకుంటున్న వీడియోను షేర్‌ చేశాడు యశ్‌. ఈ సందర్భంగా ‘సలాం రాఖీ భాయ్‌’ అంటూ ఐరా పాట అందుకోవడం విశేషం. దీనితో తండ్రి యాష్ పుత్రికోత్సాహంతో పొంగిపోయాడు.

Yash overflowing with daughter's enthusiasm!
Yash overflowing with daughter’s enthusiasm!

మరింత సమాచారం

‘సలాం రాకీ భాయ్‌.. రారా రాఖీ..’ అంటూ ఐరా క్యూట్‌గా పాడిన ఈ వీడియోను యశ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా లక్షల్లో కామెంట్లు షేర్స్ చేస్తున్నారు నెటిజన్స్. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు యశ్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు సందేశాలు పంపుతున్నారు. సో క్యూట్‌ అంటూ ఒకరు, తండ్రికి తగ్గ తనయ అని మరొకరు, ఎప్పటికైనా యష్ లాగా మంచి పేరు తెచ్చుకోవాలని మరికొందరు ఐరాపై శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. కాగా యశ్‌ 2016లో తన మొదటి సినిమా హీరోయిన్ రాధిక పండిట్‌‌ను పెళ్లిచేసుకోగా, వీరికి ఇద్ద‌రు సంతానం. కూతురు ఐరా 2018 డిసెంబర్‌లో జన్మించగా.. 2019 అక్టోబర్‌లో ఈ జంటకు యథ‌ర్వ్ జన్మించాడు.


Share

Related posts

Rakesh Master : వామ్మో… ఏంటి రాకేష్ మాస్టర్ కూడా ఇలా అయిపోయాడు..?

Teja

నాని ఆరోసారి

Siva Prasad

MAA Elections: ‘మా’ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కీలక నిర్ణయం ప్రకటించిన నాగబాబు..! అది ఏమిటంటే…?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar