సినిమా

Yash: రూ. 10 కోట్లు ఇస్తామన్నా ఆ ప‌ని చేయ‌న‌న్న య‌శ్‌.. నెటిజ‌న్లు ఫిదా!

Share

Yash: క‌న్న‌డ రాక్‌స్టార్ య‌శ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన `కేజీఎఫ్‌` సిరీస్‌తో నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయ్యాడు య‌శ్‌. ప్ర‌స్తుతం ఈయ‌న సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు ప్ర‌ముఖ బ్రాండ్ల‌కు ప్ర‌చారక‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే తాజాగా ఓ పాన్ మసాలా కంపెనీ వారు.. త‌మ బ్రాండ్‌కు ప్ర‌చారక‌ర్త‌గా ఉండాల‌ని కోరార‌ట‌.

అందుకు వాళ్లు రూ. 10 కోట్ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్ ఆఫర్ చేశార‌ట‌. కానీ, య‌శ్ మాత్రం అందుకు నో చెప్పార‌ట‌. వ్యక్తిగతంగా తనకు ఎంతో ఆర్దిక లాభం చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ.. ప్ర‌జ‌ల‌కు హానీ చేసే పొగాకు, పాన్ మ‌సాలా ఉత్ప‌త్తుల‌ను తాను ప్ర‌మోట్ చేయ‌న‌ని ఆయ‌న చెప్పేశార‌ట‌. ఈ విషయాన్ని యశ్ ఎండార్స్ మెంట్ డీల్స్ ని మ్యానేజ్ చేసే `ఎక్సీడ్ ఎంటర్టైన్మెంట్` సంస్థ స్వ‌యంగా ధృవీకరించింది.

యశ్ తీసుకున్న ఉన్న‌త నిర్ణయాన్ని స్వయంగా తెలియజేస్తూ.. ఎక్సీడ్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు చెందిన అర్జున్ బెనర్జీ ఆయ‌న‌పై పొగడ్తల వ‌ర్షం కురిపించారు. అలాగే ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో కూడా వైర‌ల్‌గా మార‌డంతో.. నెటిజ‌న్లు య‌శ్ కు ఫిదా అయిపోతూ ఆయ‌నను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

కాగా, య‌శ్ ఇటీవ‌లె `కేజీఎఫ్ 2`తో ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించాడు. ఏప్రిల్ 14న విడుద‌లైన ఈ చిత్రం.. కేవ‌లం 15 రోజుల్లో 1000 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. దీంతో దక్షిణాది నుంచి 1000 కోట్లను రాబట్టిన మూడో సినిమాగా `కేజీఎఫ్ 2` రికార్డు సృష్టించింది.


Share

Related posts

Ravi teja: రెండు దశాబ్దాల క్రితం చేసిందే ఇప్పుడు మళ్ళీ చేయగలిగిన రవితేజ .. నువ్వు దేవుడివి సామీ !

GRK

Aamani: గెస్ట్ హౌస్ కు వచ్చేయ్ అన్నారు.. వాళ్లపై సీనియర్ నటి ఆమని బిగ్ బాంబ్..!

somaraju sharma

తెలుగు సినిమాకు దిక్సూచి ‘అక్కినేని’.. పరిపూర్ణం ‘నాగేశ్వరరావు’ జీవితం..

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar