తమిళ, తెలుగు, భాషల్లో మంచి క్రేజ్ ఉన్న విశాల్ నటించిన కొత్త మూవీ ‘చక్ర’. ఇటివలే ఈ సినిమా తమిళ, తెలుగు ట్రైలర్లను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కన్నడ ట్రైలర్ ను కూడా రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళ ట్రైలర్లను ట్విట్టర్ లో రిలీజ్ కాగా.. కన్నడ ట్రైలర్ కు మాత్రం భారీ ప్రమోషన్ వచ్చేలా ప్లాన్ చేశారు.

కేజీఎఫ్ తో జాతీయస్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ తో ‘చక్ర’ కన్నడ వెర్షన్ ను రిలీజ్ చేయబోతున్నాడు. రేపు సాయంత్రం 5గంటలకు ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. దీంతో ‘చక్ర’కు మంచి ప్రమోషన్ లభిస్తున్నట్టే. సినిమా సైబర్ నేరాలపై తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో విశాల్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.