లెజెండరీ సింగర్ ఎస్పీబీ గారికి అరుదైన గౌరవం ఇచ్చిన వైసీపీ…!

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఎంతో వేదన ను కలిగించింది అని చెప్పాలి. భారత దేశంలోని ఎన్నో భాషల లో కొన్ని వేల పాటలు పాడిన ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కొద్ది రోజుల క్రితమే మరణించారు. ఆయన చిరస్మరణీయ కెరీర్కు గౌరవార్థం గా వైసిపి ప్రభుత్వం ఒక అభినందించదగ్గ నిర్ణయం తీసుకుంది.

అతని స్వంత ఊరు అయిన నెల్లూరులోని ‘గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్’ ను ‘ఎస్పీ బాలసుబ్రమణ్యం గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్’ పేరు మార్చేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్ని వైసీపీ ఆత్మకూరు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యం గారిని అతని అజరామర సినీ ప్రస్థానాన్ని సాహిత్య ప్రతిభకు ఇస్తున్న గౌరవానికి సూచకంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.