Bheemla Naayak: మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో రీమేక్ చేయాలని పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ డిసైడ్ అయిన టైంలో మొట్టమొదటి ఈ అవకాశాన్ని తెలుగులో ఒక యంగ్ డైరెక్టర్ కి అప్పజెప్పాలని అనుకున్నారట. అతడు కొన్ని సినిమాలు కమిట్మెంట్ కావడంతో… సదరు యంగ్ డైరెక్టర్ ఛాన్స్ మిస్ అయినట్లు లేటెస్ట్ టాక్ బయటకు వచ్చింది. అతను మరెవరో కాదు వివేక్ ఆత్రేయ.
ఆ సమయంలో రియల్ స్టార్ నాని తో అంటే సుందరానికి అనే సినిమా చేస్తూ ఉండటం తో బీమ్లా నాయక్ ఛాన్స్ మిస్ అయ్యిందట. తెలుగులో బ్రోచేవారెవరురా.. మెంటల్ మదిలో… అంటే సుందరానికి తో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన వివేక్ ఆత్రేయ.. ప్రస్తుతం నానితో మళ్లీ సినిమా చేస్తూ ఉన్నారు. దీంతో వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఛాన్స్ మిస్ అవడంతో.. ఈ అవకాశాన్ని అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమాతో.. సత్తా చాటిన డైరెక్టర్ సాగర్ చంద్ర చేతిలో పెట్టడం జరిగింది అంట.
దీంతో సాగర్ చంద్ర తన హండ్రెడ్ పర్సెంట్… కృషితో సినిమా బాగా రాణించిన ట్లు తాజాగా ఇండస్ట్రీ నుండి టాక్ నడుస్తోంది. సినిమా నిర్మాత నాగ వంశీ.. మాట్లాడుతూ ఏకంగా పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారని ఇంటర్వ్యూలో చెప్పటంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా… సినిమా గురించి పాజిటివ్‌గా కామెంట్ చేస్తూ ఉండటంతో గ్యారెంటీ బ్లాక్ బస్టర్ హిట్ అని అంటున్నారు. ఫిబ్రవరి 25వ తారీకు నాడు “బీమ్లా నాయక్” విడుదల చేస్తున్న తరుణంలో ఫిబ్రవరి 21వ తారీకు ఫ్రీ రిలీజ్ వేడుక తో పాటు అదే రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నారు.