స్వామి రారా సినిమా నుంచి కుర్ర హీరో నిఖిల్ తన ప్రతి సినిమా ఢిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటున్నాడు. కొత్త కొత్త ప్రయోగాతో ఆడియన్స్‌లో క్యూరియాసిటి క్రియేట్ చేస్తున్నాడు. ఒకటి అరా తప్ప ప్రయోగం చేసిన ప్రతి సినిమాతో సక్సెస్ కొట్టాడు. దీంతో ఆడియన్స్ కూడా నిఖిల్ సినిమా అంటే కొత్తగా ఉంటుందని భావనకు వచ్చేశారు. అయితే ఇటివల రోటీన్ స్టోరీలతో సినిమాలు చేసి సక్సెస్‌కు దూరంగా ఉన్నాడు. అందుకే తనని మినీమమ్ గ్యారెటీ హీరోగా చేసిన ప్రయోగత్మక చిత్రాల వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ క్రమంలో డిఫరెంట్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ మధ్యే కన్నడ సూపర్ హిట్టు కిర్రాక్ పార్టీని తెలుగులో కిరాక్ పార్టీగా రిమేక్ యావరేజ్ హిట్ అందుకున్న నిఖిల్ ఇప్పుడు తమిళ్లో సూపర్ హిట్ అయిన కనితన్ అనే సినిమాని తెలుగులోముద్ర అనే టైటిల్ రీమేక్ చేస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఈ వారమే రిలీజ్ కావల్సింది. కానీ మళ్లీ రీ షూట్‌కు వెళ్లడం, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ డీలే కావడంతో రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ఇదే నిఖిల్ సినిమాకు కొత్త సమస్యని తెచ్చిపెట్టింది.
సేమ్ టైటిల్‌తో టీఎన్ సంతోష్ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సినిమా చేశాడు. టైటిల్ సేమ్ ఉండడంతో నిఖిల్ సినిమాకు టైటిల్‌కు నిఖిల్ ముద్ర అని ఫిక్స్ చేశారు.అయితే జగపతిబాబు నటించిన ముద్ర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ లోగో పోస్టర్ డిజైన్ నిఖిల్ నటించిన ముద్ర లాగే ఉండడంతో, ఇది నిఖిల్ సినిమానే అనుకొని జగపతిబాబు నటించిన ముద్ర సినిమా టికెట్లు ఆన్ లైన్లో బుక్ చేసుకుంటున్నారు నిఖిల్ ఫ్యాన్స్. ఈ ఇదే విషయాన్ని ఓ అభిమాని నిఖిల్‌కు ఫార్వాడ్ చేశాడు. దీంతో నిఖిల్ ఇది తన సినిమా కాదని కొంతమంది కావాలనే తన ముద్ర సినిమా సేమ్ లోగో డిజైన్‌తో తన పేరు పెట్టాని, ప్రోడ్యూసర్ ఈ విషయాన్ని పరిశీలుస్తున్నారటు ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇక తన ముద్ర సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో త్వరలో అనౌన్స్ చేస్తాని వెల్లడించాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందకు ఎప్పుడు వస్తుందో చూడాలి.