NBK 108: అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిన్న ఉగాది పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. “NBK 108” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది. ఇంకా ఇదే సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర రంగంలో ఇటీవల కాలంలో వరుస పెట్టి ఆఫర్లు అందుకుంటున్న హీరోయిన్ శ్రీ లీల. “పెళ్లి సందడి” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రవితేజతో “ధమాకా”తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇంకా చాలామంది హీరోలతో వరుస అవకాశాలు అందుకుంటూ ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ తో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆయనపై శ్రీ లీల కీలక వ్యాఖ్యలు చేసింది. తాను మొదటి నుండి నందమూరి బాలయ్య బాబు వీరాభిమాని అని చెప్పుకొచ్చింది. ఆయనతో నటించడం మొదలుపెట్టాక ఇంకా ఆయనపై అభిమానం మరింతగా పెరిగిందని తెలిపింది. బాలకృష్ణది ఏంతో గొప్ప వ్యక్తిత్వం అని చెప్పుకొచ్చింది. బాలయ్య సినిమాలో తన పాత్ర గురించి తెలిస్తే అందరూ షాక్ అవుతారని సస్పెన్స్ క్రియేట్ చేసింది.
ఇంకా మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తున్నానని శ్రీలీల వెల్లడించింది. రామ్, వైష్ణవ్ తేజ్, నవీన్ పొలిశెట్టిల చిత్రాల్లోనూ కూడా నటిస్తున్నట్టు స్పష్టం చేసింది. దీంతో శ్రీ లీల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా పండుగ కానుకగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఈ సినిమాలో బాలయ్య పెద్ద తరహా పాత్ర మాస్ ప్రేక్షకులతో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.