NewsOrbit
Entertainment News సినిమా

HBD Prabhas: జపాన్ లో గ్రాండ్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్..!!

Share

HBD Prabhas: నేడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు భారీ ఎత్తున విషెస్ తెలియజేస్తున్నారు. 2002వ సంవత్సరంలో “ఈశ్వర్” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. మొదటి సినిమాతో ఓ మాదిరి గుర్తింపు సంపాదించాడు. కృష్ణంరాజు వారసుడిగా యంగ్ రెబల్ స్టార్ గా ప్రభాస్ 2004వ సంవత్సరంలో “వర్షం”తో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. 2005వ సంవత్సరంలో ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో “చత్రపతి” సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ కి మాస్ లో విపరీతమైన ఇమేజ్ పెరిగిపోయింది.

Young rebel star Prabhas birthday celebrations in Japan grand

ఆ తర్వాత అనేక సినిమాలు చేసి చేసిన ప్రభాస్ “బాహుబలి” సినిమాతో ప్రపంచ స్థాయిలో అద్భుతమైన హిట్ అందుకోవటం జరిగింది. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారడం జరిగింది. బాహుబలి భారతీయ చలనచిత్ర రంగంలో అన్ని రికార్డులను బ్రేక్ చేసిన సినిమా. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీలలో అప్పట్లో “బాహుబలి” రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో ఒక్కసారిగా భారతీయ చలనచిత్రా రంగం యొక్క స్థాయి పెరిగిపోయింది. ఇండియా తో పాటు జపాన్ లో కూడా బాహుబలి అనేక రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో జపాన్ దేశంలో ప్రభాస్ కి ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. భారతదేశంలో మాదిరిగానే జపాన్ దేశంలో కూడా ప్రభాస్ సినిమాలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది.

Young rebel star Prabhas birthday celebrations in Japan grand

జపాన్ దేశంలో ఊహించని రీతిలో ప్రభాస్ కి అభిమానులు ఉన్నారు. అయితే అక్టోబర్ 23వ తారీకు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో జపాన్ దేశంలో అభిమానులు.. ఈ బర్తడే వేడుకలను భారీ స్థాయిలో చేయటం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ప్రస్తుతం ఎందుకు సంబంధించినటువంటి ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జపాన్ దేశంలో ప్రభాస్ అభిమానులు ఒక రూమ్ నిండా.. ప్రభాస్ ఫోటోలతో పాటు కటౌట్స్ పెట్టి పూలతో డెకరేట్ చేసి.. దండాలు మరియు ప్రసాదాలు పూజలు చేస్తూ ఉన్నారు. తెలుగులో ఇప్పటివరకు ఏ స్టార్ హీరోకి జపాన్ లో ఈ స్థాయిలో అభిమానం దక్కలేదు. 44వ ప్రభాస్ జన్మదిన వేడుకలు దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో అభిమానులు భారీ ఎత్తున జరుపుకుంటున్నారు.


Share

Related posts

బ్యాడ్ న్యూస్: ఆ ‘డైరెక్టర్’తో ప్రభాస్ సినిమా క్యాన్సిల్?

Teja

రివ్యూ : ‘క్రేజీ అంకుల్స్’ ట్రెయిలర్

siddhu

బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్.. తెలిస్తే ఎవరైన సరే షాక్ అవుతారు!

Teja