Unstoppable 2: ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” టాకీషో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ ఓటిటి రంగంలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మరియు ప్రముఖ హీరోలు దర్శకులు తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం సెకండ్ సీజన్ ఈనెల ప్రారంభం నుండి స్టార్ట్ కాగా మొదటి సీజన్ కి భిన్నంగా సినిమా సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా షోకి హాజరవుతున్నారు. దీనిలో భాగంగా అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ టీడీపీ అధినేత చంద్రబాబు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ తో స్టార్ట్ చేయడం జరిగింది.
చంద్రబాబు “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఈ షోలో చంద్రబాబు తన పొలిటికల్ మరియు వ్యక్తిగత జీవితంకి సంబంధించి అనేక కొత్త విషయాలు తెలియజేశారు. ఎన్నడూ లేని రీతిలో ఈ షోలో చంద్రబాబు చాలా నవ్వుతూ కనబడ్డారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరో పొలిటికల్ లీడర్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు … తెలంగాణ వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఈ షోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి అక్కడ షర్మిల పాదయాత్ర చేస్తూ ఉంది. ఇప్పటికే ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో షర్మిల రావటం తెలిసిందే.
దీంతో కచ్చితంగా బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షోకి షర్మిల వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. షర్మిల వస్తే మాత్రం కచ్చితంగా ఈ ఎపిసోడ్ చంద్రబాబు, లోకేష్ ఎపిసోడ్ లు కంటే మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు. సెకండ్ సీజన్ లో ఇప్పటికే రెండు ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యాయి. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు.. లోకేష్ పాల్గొన్నారు. రెండో ఎపిసోడ్ లో విశ్వక్ సేన్, డీజే టిల్లు హీరో సందీప్ జొన్నలగడ్డ రావటం జరిగింది. ఇక మూడో ఎపిసోడ్ లో శర్వానంద్, అడవి శేషు పాల్గొన్నారు. శుక్రవారం మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మరి షర్మిల ఓకే అయితే ఆమె ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.