బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కు క్యాన్సర్ అని తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. శ్వాస సంబంధమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ కి సంజయ్ దత్ గురయ్యాడని అతని సన్నిహితుడు ఒకరు మంగళవారం వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న సంజయ్ దత్ అభిమానులు, సన్నిహితులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మరోవైపు సంజయ్ తాను చేయాల్సిన సినిమా షూటింగు లన్నిటికీ బ్రేక్ చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా క్యాన్సర్ చికిత్స కోసం సంజయ్ దత్ ఈ వారంలోనే అమెరికా వెళ్లడానికి ఏర్పాటు చేసుకుంటున్నారట. ఇటువంటి తరుణంలో భారత క్రికెట్ మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్…. సంజయ్ దత్ కి క్యాన్సర్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో క్యాన్సర్ బారిన పడి పూర్తిగా కోలుకున్న యువరాజ్ సింగ్.. . సంజయ్ దత్ కి సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ క్యాన్సర్ నొప్పి ఎలా ఉంటుందో తనకు తెలుసు అని, ఆ నొప్పిని స్వయంగా అనుభవించాను, భరించాను అని పేర్కొన్నారు. సంజయ్ దత్…. ఇప్పుడు మీరు ఒక యోధుడిలా పోరాడాలి, మీ మనసును ఆత్మవిశ్వాసాన్ని మరింత ధృఢంగా మలుచుకోవాలని యువరాజ్ సింగ్ సూచించారు. అంతే కాకుండా త్వరగా కోలుకోవాలని, క్యాన్సర్ ని జయించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాట్లు యువరాజ్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
గతంలో యువరాజ్ సింగ్ 2011 వరల్డ్ కప్పు సమయంలో ….. ఇండియా విజేతగా గెలవటం లో ప్రముఖ పాత్ర పోషించారు. అయితే ఆ సమయంలో భారతీయులంతా సంబరాలు చేసుకుంటున్న తరుణంలో యువరాజ్ సింగ్ కి క్యాన్సర్ అనే వార్త బయటపడటంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ తింది. అయితే ఆ తర్వాత అమెరికాలో చికిత్స తీసుకుని యువరాజ్ సింగ్ క్యాన్సర్ ని జయించి ప్రస్తుతం నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!