తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే కామెడీ షో జబర్దస్త్. ఈ షోలో హైపర్ ఆది స్కిట్ లు అంటే ఎగబడి మరీ చూస్తారు. స్కిట్ లో నాన్ స్టాప్ పంచ్ డైలాగులతో.. తన ప్రాసతో ఆది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. ముఖ్యంగా ప్రేక్షకులు ఆల్రెడీ సోషల్ మీడియాలో లేక సమాజంలో జరిగిన సంఘటనకు కనెక్ట్ అయిన విషయాన్ని… చిన్న లైన్ గా తీసుకుని దాన్ని చుట్టూ పంచ్ కామెడీ వాతావరణం సృష్టిస్తూ జనాలను కడుపుబ్బ నవ్విస్తాడు.
ఆ విధంగా టిక్ టాక్ దుర్గారావు… ఇంకా కొంతమంది వ్యక్తిగత జీవితాలను ఆధారం చేసుకుని ఆది స్కిట్ లు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా నెక్స్ట్ స్కిట్ లో హైపర్ ఆది బిచ్చగాళ్ళ వేషం లో ఎంట్రీ ఇవ్వనున్నరు. అయితే ప్రతీ కాంటేస్తంట్ స్కిట్ చేసేముందు సాంగ్ వేస్తుంటారు ఆ విధంగానే బిచ్చగాళ్ళ స్కిట్ కి ఎంట్రీ సాంగ్ వస్తుంటే అడుక్కునే వాళ్లకు ఎంట్రీ సాంగ్ అవసరమా అని శాంతి స్వరూప్ ఏడ్చిన డైలాగ్ హైలెట్. ఇక హైపర్ ఆది అందుకుని పంచ్ ల ప్రవాహాన్ని స్టార్ట్ చేస్తాడు. ..పేమెంట్లు పెంచమని మనం అడుక్కుంటాము.., క్లోజప్లు వేయమని అనసూయ అడుక్కుంటుంది, వేరే షోలకు రమ్మని వాళ్లు అడుక్కుంటారు.., వద్దు ఇక్కడే ఉండమని వీళ్లు అడుక్కుంటారు.
మీరు మీరు కలిసి మమ్మల్ని మింగకండని మనం అడుక్కుంటాము అంటూ వరుసగా డైలాగ్లు చెప్పేశాడు. దీంతో ఈ ప్రోమో చూసిన హైపర్ ఆది అభిమానులు మామూలోడు కాదు మా వాడు అని తెగ పొగుడుతున్నారు. మరోపక్క హైపర్ ఆది వేసిన పంచులు చూస్తే వచ్చే వారం ఈ స్కిట్ అసలు మిస్సవకూడదని సోషల్ మీడియాలో జబర్దస్త్ అభిమానులు తెగ కామెంట్లు పెడుతు షేర్లు కొడుతున్నారు.