జబర్దస్త్ జడ్జీల లో ఒకరు అయినా రోజా ఎక్కువగా సుడిగాలి సుదీర్ మీద వేసే పంచ్ డైలాగులు బాగా పేలతాయి. చాలావరకు సుధీర్ గాలి ఎక్కువగా రోజా చాలా చిన్న డైలాగ్ తో తీసేస్తుంటారు. సుధీర్, రాంప్రసాద్, గెటప్ శీను కలసి చేసే స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి అని అందరికీ తెలిసిందే. వీళ్ళ స్కిట్ లకి యూట్యూబ్ లో కూడా మంచి ఆదరణ దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా యాంకర్ రష్మీ ని టార్గెట్ చేసుకుని సుధీర్ వేసే డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులను బోర్ కొట్టించవు.
ఇటువంటి పరిస్థితుల్లో వేరే టీంలో సుడిగాలి సుదీర్ గెస్ట్ గా రాబోతున్నాడు. చాలావరకు సుధీర్ ఏదైనా టీం లో ఉంటే రోజా రష్మీ వేసే పంచులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. ఈ నేపథ్యంలో గెస్ట్ గా సుధీర్ వీధుల్లో కొరడాలతో కొట్టుకుని గెటప్ వేసుకుంటాడు. అయితే స్కిట్ లో సుధీర్ వేసే పంచులు ఒక స్థాయి అయితే… రష్మి, రోజా వేసే డైలాగులు మరో ఎత్తు. కాగా నెక్స్ట్ వీక్ ఈ విధంగా కొరడాలతో కొట్టుకునే గెటప్పులో సుడిగాలి సుదీర్.. రష్మీ దగ్గరకు వెళ్లి యాంకర్ రష్మీ ని చేసుకుందాం అనుకుంటే.. అడుక్కునే రష్మీని చేసుకోవాల్సి వచ్చింది అంటూ సుధీర్ తన ఫ్రస్ట్రేషన్‌ను బయట పెట్టాడు.
మళ్లీ కొద్దిసేపు తర్వాత గతంలో లాక్ డౌన్ తర్వాత స్టార్ట్ అయిన ప్రోగ్రాంలో రష్మికి వేసిన డైలాగ్ సుడిగాలి సుధీర్ వేయడం జరిగింది. నేను చచ్చిపోతే నువ్ ఏడుస్తావో లేదో గానీ నువ్ ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతాను అనే అరిగిపోయిన డైలాగ్ కొట్టేలోపే రోజా పూర్తి చేసేసింది. అలా పూర్తి చేయడమే కాకుండా చావురా చావు అంటూ ఎక్స్ ట్రాగా సెటైర్ వేసింది. దీంతో స్టేజి మీద సుధీర్ కి జడ్జి రోజా గాలి తీసినట్లయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసి చాలామంది పాపం సుడిగాలి సుధీర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.