Super Queens 2: మహిళల కోసమే ప్రత్యేకించి సీరియళ్లతోపాటు వంటలు, కళలు, ఫ్యాషన్ తదితర అంశాలకు సంబంధించి రకరకాల షోలు రూపొందిస్తున్నాయి టీవీ చానళ్లు. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా.. జీవితంలో విజేతలై నిలిచి ప్రేక్షకుల మనసులలో తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న పదిమంది బుల్లితెర నటీమణులతో ‘సూపర్ క్వీన్’ అనే ఓ రియాలిటీ షోను ప్రారంభించిన జీ తెలుగు.. సీజన్ వన్ సక్సెస్ఫుల్గా రన్ చేసింది ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో సీజన్ 2తో మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సూపర్ క్వీన్ సీజన్ 2 ప్రోమో విడుదల అయింది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

నా ప్రయాణం నా కోసం కాదు అంటూ కండక్టర్ ఝాన్సీ లక్ష్మితో ఈ ప్రోమో మొదలవుతుంది.. నా గమ్యం నాది కాదు.. నేను అనే పదం తప్ప.. నేను అనే నిజం నాకు తెలీదు.. నా ఓటమి ఎదురుగా వేల మంది.. నా గెలుపు వెనక నేనొక్కదానినే.. నాకు భయం నా గెలుపు ఎందరిని ఓడిస్తుందోనని.. నాకు భయం నా గెలుపు ఎందరిని కుంగ తీస్తుందోనని.. నా నవ్వు కొందరిని బాధ పెడుతుంది.. నా బాధ ఎందరికో నవ్వునిస్తుంది.. అందరూ ఉన్న ఒంటరిని నేను అంటూ సీరియల్ హీరోయిన్ సుహాసిని పరిచయం చేస్తూ వరుసగా పదిమంది పరిచయం చేస్తుంటారు..
అయినా నేను రానిని నా జీవితానికీ నేనే మహారాణి ని.. వాళ్ల ఆవేదన సముద్రమంత లోతు వాళ్లు పంచే ప్రేమ, ఆప్యాయత కొండంత ఎత్తు.. శివంగుల మధ్య సమరం ఆరంభం సూపర్ క్వీన్స్ సీజన్ 2 త్వరలో మీ ముందుకు రానుంది అంటూ ఈ ప్రోమో ఎండ్ అవుతుంది.. ఈ సీజన్లో జబర్దస్త్ కమెడియన్ పవిత్ర బ్రహ్మ ముడి సీరియల్ హీరోయిన్ , దేవత సీరియల్ హీరోయిన్ సుహాసిని, ఇంటింటి గృహలక్ష్మి విలన్ లాస్య, కండక్టర్ ఝాన్సీ, ఓ విప్లవకారిణి తోపాటు మరి కొంతమంది సినీ సీరియల్ నటీమణులు ఈ సూపర్ క్వీన్ టు లో పోటీ పడనున్నారు.. త్వరలోనే సీజన్ 2 ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ప్రోమో విడుదలవగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.