NewsOrbit
Cricket Sports ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Bezawada Tigers vs Coastal Riders: బెజవాడ టైగెర్స్ vs కోస్టల్ రైడర్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో ఓడిన విజయవాడ టీం | Andhra Premier League 2023

Andhra Premier League 2023 Season 2 Match 1: Bezawada Tigers vs Coastal Riders Match Details, Where to watch Andhra Premier League 2023
Advertisements
Share

Bezawada Tigers vs Coastal Riders: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారు. మన ఆంధ్ర ప్లేయర్లు రంజీ ట్రోఫీ పోటీ లలో కూడా చాలా బాగా ఆడుతున్నారు. యువ క్రికెటర్లను ప్రోత్సహించే ఉద్దేశం తో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించింది. ACA ఆధ్వర్యంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీసన్ కి అంతా సిద్ధం అయింది. ఆగస్టు 16 అంటే నిన్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లో భాగంగా మొదటి మ్యాచ్ కోస్టల్ రైడర్స్ తో బెజవాడ టైగర్స్ (విజయవాడ ) మధ్య జరిగింది.

Advertisements
Andhra Premier League 2023 Season 2 Match 1: Bezawada Tigers vs Coastal Riders Match Details, Where to watch Andhra Premier League 2023
Andhra Premier League 2023 Season 2 Match 1 Bezawada Tigers vs Coastal Riders Match Details Where to watch Andhra Premier League 2023

Andhra Premier League 2023 Season 2 Match 1: ఆగస్టు 16న జరిగిన కోస్టల్ రైడర్స్ ఇంకా బెజవాడ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోస్టల్ రైడర్స్ 12 పరుగుల తేడాతో విజయం సాదించింది. మొదట బాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ 149/8 పరుగులు సాధించగా బెజవాడ టైగెర్స్ 137 పరుగులకే ఆలౌట్ అయ్యి మొదటి ఓటమి చవిచూశారు.కోస్టల్ రైడర్స్ తరుపున 30 బంతుల్లో 32 పరుగులు సాధించి మద్దిల హర్షవర్ధన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు, బెజవాడ టైగెర్స్ కు చెందిన మున్నంగి అభినవ్ 44 బంతుల్లో 57 పరుగులు సాధించి చక్కటి ప్రతిభ ప్రదర్శించాడు.

Advertisements

ఆగస్టు 17న జరగనున్న ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు వివరాలు: వైజాగ్ వారియర్స్(Vijag Warriors) vs గోదావరి టైటాన్స్ (Godavari Titans) సాయంత్రం 5.30కు. రాయలసీమ కింగ్స్(Rayalaseema Kings) vs ఉత్తరాంధ్ర లయన్స్(Uttarandhra Lions) రాత్రి 10.30కు జరగనుంది. విజయవాడ ప్రేత్యక్ష ప్రసారం ఫ్యాన్ కోడ్(Fan Code App) లేదా ఎయిర్టెల్ స్ట్రీమ్ లో చూడొచ్చు.

ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ ఆగష్టు 16 (బుధవారం)న వైజాగ్ లోని PM పాలెంలోని డాక్టర్ YSR ACA VDCA స్టేడియంలో ప్రారంభమవుతుంది. ప్రముఖ సినీనటి శ్రీ లీల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు . భారతదేశం యొక్క ప్రధాన క్రీడా గమ్యస్థానమైన ఫ్యాన్‌కోడ్, ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) రెండవ సీజన్‌ను ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో 19 మ్యాచ్‌లు జరగనున్న ఈ టోర్నీ ఆగస్టు 16 నుంచి 27 వరకు జరగనుంది. హనుమ విహారి, కెఎస్ భరత్ మరియు రికీ భుయ్ వంటి ఆంధ్రప్రదేశ్ అగ్ర తారలు ఈ సంవత్సరం పాల్గొనే ఆటగాళ్లలో ఉన్నారు .
రెండో సీజన్‌ను చాలా ఘనంగా అట్టహాసంతో ప్రారంభం చేసేందుకు అధికారులు ప్రణాళిక వేశారు. ఈ వేడుక ప్రారంభోత్సవానికి ఎందరో క్రికెట్ అతిరధ మహారధులు హాజరుకానున్నారు. వివిధ జిల్లాల్లో గ్రూపింగ్ మరియు ప్రాక్టీస్ సెషన్ల తర్వాత, మొత్తం ఆరు జట్లు – కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్, మార్లిన్ గోదావరి టైటాన్స్ మరియు కెవిఆర్ ఉత్తరాంధ్ర లయన్స్ విశాఖపట్నం చేరుకున్నాయి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ యొక్క మ్యాచ్‌లకు ప్రవేశం పూర్తిగా ఉచితం. ఈ లీగ్ ప్రారంభం సందర్భంగా లక్ డిప్ పోటీని నిర్వహించాలని ACA నిర్ణయించింది. మ్యాచ్ చూసేందుకు వచ్చే వారు తమ పేర్లను లక్కీ డిప్‌లో వేసి స్టేడియంలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయవచ్చని అధికారులు ప్రకటించారు. మ్యాచ్‌ల రోజు, ఆగస్టు 16, 19, 20, 26 మరియు 27, మ్యాచ్ ప్రారంభమైనప్పుడు, లక్కీ డిప్ నుండి ఐదు లక్కీ టిక్కెట్‌లను ఎంపిక చేస్తారు మరియు వారికి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టి 20 మ్యాచ్ చూడటానికి ఉచిత పాస్‌లు ఇవ్వబడతాయి. తొలి మ్యాచ్‌ ‘కోస్టల్ రైడర్స్’ మరియు ‘బెజవాడ టైగర్స్’ ల జరిగనుంది , దానికి మధ్య అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇటీవల విశాఖపట్నం, విజయవాడలలో ‘మన ఆంధ్ర మన APL’ నినాదంతో ACA సభ్యులు ‘3K రన్‌’ను నిర్వహించారు. యువ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎంతగానో దోహద పడుతుంది.

ఏసీఏ సెక్రటరీ ఎస్.ఆర్. స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ 2 హెచ్‌డి, స్టార్ తెలుగులో ఫ్యాన్‌కోడ్‌తో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని అందజేస్తామని గోపీనాథ్ రెడ్డి తెలిపారు.

ఈ సీజన్‌లో భారత క్రికెటర్ హనుమాన్ విహారి రాయలసీమ కింగ్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. విశాఖపట్నానికి చెందిన భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కె. శ్రీకర్ భరత్ ఉత్తరాంధ్ర లయన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.


Share
Advertisements

Related posts

Cold: ఈ సీజన్లో జలుబు రాకుండా ఉండాలంటే ఇది చేయాలట..!!

bharani jella

Health: ఇలా చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది!!

Kumar

ఈ రోజు పంచాయితీ ఎన్నికల నామినేషన్లు..! అసలు ఏపీ లో ఎన్నికలు ఉన్నట్లా… లేనట్టా?

siddhu