ఆస్ట్రేలియన్ IPL: ఇండియాలో ఐపీఎల్ టోర్నీ క్లిక్ అయిన తర్వాత చాలా దేశాలు ఈ దిశగా టోర్నమెంటులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో లోకల్ టాలెంట్ కి పెద్దపీట వేస్తూ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఈ దిశగానే ఆస్ట్రేలియన్ IPL.. బిగ్ బాష్ లీగ్ కొనసాగుతోంది. లేటెస్ట్ గా బిగ్ బాష్ లీగ్ ఈ ఏడాదికి సంబంధించి నేటి నుండి మ్యాచ్ లు జరుగుతున్నాయి. డిసెంబర్ 13 నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 61 మ్యాచ్లు జరగనున్నాయి.

ఎలిమినేటర్, క్వాలిఫైయర్, నాకౌట్, చాలెంజర్, ఫైనల్.. ఈ దిశగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇండియాలో ఈ మ్యాచ్ లు సోనీ సిక్స్ లో లైవ్ స్ట్రీమ్ లో వీక్షించవచ్చు. మొత్తం ఎనిమిది జట్లు.. టైటిల్ గెలవడానికి తలపడుతున్నాయి. సిడ్నీ థండర్, సిడ్నీ సిక్సర్స్, పేర్త్ స్కార్చేర్స్, మెల్బోర్న్ స్టార్స్, మెల్బోర్న్ రెనేగడేస్, హోబర్ట్ హరికెన్స్, బ్రిస్ బ్యాన్ హిట్, అడి లైట్ స్ట్రైకర్స్.. ఈ జట్లు పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా ప్లేయర్ లతోపాటు ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా.. ఈ టోర్నమెంటులో పాల్గొనడం జరిగింది.

అయితే మొదటి మ్యాచ్ సిడ్నీ థండర్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ మధ్య ఈరోజు జరగనుంది. ఆస్ట్రేలియా పిచ్ లు కావటంతో టి20 మ్యాచ్ లు నేపథ్యంలో… విదేశీ ఆటగాళ్లు ఇక్కడ సరిగ్గా రానిస్తే ఎక్కడైనా సత్తా చాటే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే ఆస్ట్రేలియా క్రికెట్ పిచ్ లకి మంచి పేరు ఉంది. బిగ్ బాష్ లీగ్ లో ప్రస్తుతం పాల్గొనబోయే విదేశీ ప్లేయర్లకు ఇది ఒక సువర్ణ అవకాశం అని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.