IPL 2023: ఐపీల్ 2023 సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ కావ్య మారన్ కు అంత కలిసి రాలేదు. సౌత్ ఆఫ్రికన్ టీ20 లీగ్ లో అక్కడ సన్ రైజర్స్ టీం తో విజయం సాధించి కప్ గెలుచుకున్న కావ్య మారన్ అదే అదృష్టం ఐపీల్ 2023 లో చూడట్లేదు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో సన్ రైసర్ హైదరాబాద్ టీం సరిగ్గా ఆడలేదు, మొత్తం 11 సార్లు అడగా కేవలం నాలుగు విజయాలతో ఐపీల్ పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో ఉంది హైదరాబాద్ జట్టు. అయితే 10వ స్థానం లో ఉన్న ఢిల్లీ ఎలిమినేట్ అయినట్లు సన్ రైజర్స్ ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు…అవును సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇంకా బతికే ఉన్నాయి, హైదరాబాద్ టీమ్ ఐపీల్ 2023 ఎలా గెలుచుకోవొచ్చో ఇప్పుడు చూద్దాం…
ఆదివారం రోజు జరిగిన 61వ ఐపీల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కి కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై పైన కోల్‌కతా మంచి విజయం సాధించడం తో ఐపీల్ 2023 పాయింట్స్ టేబుల్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ తరువాత చెన్నై 2వ స్థానంలో ఉన్నప్పటికీ మొత్తం 13 మ్యాచ్లు ఆడి కేవలం 7 పాయింట్స్ మాత్రమే సాధించ గలిగింది. మరోవైపు 13 మ్యాచులు తరువాత 6 పాయింట్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా క్వార్టర్ ఫైనల్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన బెంగుళూరు Vs రాజస్థాన్ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోవడం తో ఐపీల్ 2023 ఇంకా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఆదివారం జరిగిన మ్యాచ్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కి కలిసి వొచ్చి ఐపీల్ 2023 లో ఇంకా సజీవంగా ఉండి పోరాడే అవకాశం దక్కింది అని చెప్పాలి.

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ మ్యాచ్లు ఆడాలంటే మే 15 నుండి మే 21 వరకు జరగబోయే మ్యాచ్ ఫలితాలు అనుకూలంగా రావాలి. మొదట మే 15న గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచ్ లో ఎక్కువ రన్ రేట్ తో హైదరాబాద్ గెలవాలి. ఆ తరువాత మే 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో మే 21న ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తల్పడననుంది…ఈ రెండు మ్యాచ్లు కూడా ఎక్కువ సగటు రన్ రేట్ తో హైదరాబాద్ గెలవాలి. కానీ హైదరాబాద్ ప్లే ఆఫ్ కి వెళ్లడం అంత సులబమైన విషయం కాదు… మిగిలిన మ్యాచ్లు కూడా సన్ రైజర్స్ కి అనుకూలించాలి. ఉదాహరణకి మే 21న జరిగే బెంగుళూరు Vs గుజరాత్ మ్యాచ్ లో గుజరాత్ గెలవాలి దానికంటే ముందు లక్నో పై ముంబై గెలిచి రెండో స్థానం లోకి వెళ్తే సన్ రైజర్స్ కి అవకాశాలు మెరుగు పడతాయి. ఇక ఢిల్లీ విషయానికి వొస్తే ఎలాగో ఎలిమినేట్ అయింది కానీ మిగిలిన రెండు మ్యాచ్లు బాగా ఆడి ఎక్కువ రన్ రేట్ తో గెలిస్తే ఢిల్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ కి పరోక్షంగా సహాయ పడినట్లే. అయితే ఇప్పటి వరకు ఐడెన్ మార్క్రమ్ నేతృత్వం లో హైదరాబాద్ ఆడిన తీరు చూస్తే పై చెప్పిన విధంగా రానున్న మూడు మ్యాచ్లు వరుసగా గెలుస్తుందా అనే సందేహం రావడం సహజమే అంతే కాదు సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ అదృష్టం కూడా అంత కలిసివొచ్చేలా లేదు…కానీ ఐపీల్ లో ఏదైనా జరగవొచ్చు మనం వేచి చూడాల్సిందే.