IPL 2023: అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు పాటలు మారుమ్రోగాయి. RRR… పుష్ప సినిమాల పాటలకు రష్మిక మందన మరియు తమన్నా అదిరిపోయే స్టెప్పులు వేయడం జరిగింది. ఇదిలా ఉంటే మొదటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరి వరకు సాగింది. అయితే చివర ఆఖరికి గుజరాత్ టైటాన్స్ గెలిచింది. చెన్నై పై ఐదు వికెట్ల తేడాతో గెలవడం జరిగింది.
ఇదిలా ఉంటే ఈ 16వ సీజన్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చరిత్ర సృష్టించారు. మేటర్ లోకి వెళ్తే ఐపీఎల్ లోనే అత్యంత పెద్ద వయస్కుడు కెప్టెన్ గా నిలిచారు. ధోని ప్రస్తుత వయసు 41 సంవత్సరాల 265 రోజులు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మాజీ క్రికెటర్ దివంగత స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ పేరిట ఉండేది. అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా 41 సంవత్సరాల 249 రోజుల అత్యంత ఓల్డెస్ట్ కెప్టెన్ గా ఐపీఎల్ లో నిలిచాడు.
అయితే ఇప్పుడు ఆ రికార్డును గుజరాత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోని బ్రేక్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ధోని ఆడే చివరి ఐపీఎల్ ఇదే. సో ఎలాగైనా టైటిల్ గెలిచి ఘనంగా వీడ్కోలు పలకాలని.. ఈ సీజన్ నీ ధోని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందట. ఇటువంటి క్రమంలో మొదటి మ్యాచ్ గుజరాత్ తో చెన్నై ఓటమి పాలు కావటం… CSK అభిమానులకు ఎంతో నిరాశ కలిగించింది. గుజరాత్ టీం హోమ్ గ్రౌండ్ అయినా గాని దాదాపు 70 శాతం మంది చెన్నై సూపర్ కింగ్స్ మద్దతు తెలిపే వాళ్లే ఉండటం విశేషం.