PAK vs NZ World Cup 2023: ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ ప్రదర్శన ఆశించిన రీతిలో లేదు. ప్రారంభంలోనే చాలా మ్యాచులు ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా చిన్న టీం లాంటి ఆఫ్ఘనిస్తాన్ పై కూడా పాకిస్తాన్ ఓడిపోవడం ఆ దేశ క్రికెట్ ప్రేమికులకు మాజీ ఆటకాలకు ఎంతో ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. పాకిస్తాన్ టీం లో ఆటగాళ్ల మధ్య ఐక్యమత్యం లేదని అనేక విమర్శలు వచ్చాయి. చాలామంది పాక్ మాజీ క్రికెటర్లు.. దుమ్మెత్తి పోయడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ సెమీస్ కి వెళ్ళటం అన్నది సంక్లిష్టంగా మారింది. అయితే శనివారం బెంగళూరులో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గెలవడంలో వరణుడు ప్రముఖ పాత్ర పోషించాడు.
టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. కివీస్ ఆటగాళ్లు రచిన్ 108, విలియంసన్ 95, ఫిలిప్స్ 41, చాప్ మాన్ 39.. పరుగులు చేయడం జరిగింది. దీంతో మొత్తం 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 భారీ స్కోర్ చేయడం జరిగింది. ఆచితూచి ఆడైనా సరే న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ గెలుద్దామని భావించిన పాకిస్తాన్ కి ప్రారంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఏకంగా 400కు పైగా పరుగులు టార్గెట్ పెట్టడంతో.. పాకిస్తాన్ ఇక ఇంటికి అని అందరు భావించారు.
ఇటువంటి పరిస్థితులలో 402 పరుగుల లక్ష్యంతో రెండో బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ ప్లేయర్స్ మొదటి నుండి దూకుడుగా ఆడటం జరిగింది. అయితే మధ్యలో వర్షం కొన్నిసార్లు పడటంతో అంపైర్లు ఓవర్లను కుదించారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 41 ఓవర్ లలో 342 పరుగులను టార్గెట్ గా నిర్ణయించారు. అయినా వర్షం పడుతూ ఉండటంతో ఆటకు అంతరాయం కల్పించడంతో స్కోర్ బోర్డు బట్టి డక్ వర్త్ లూయిస్ ప్రకారం 21 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను అంపైర్లు విజేతగా ప్రకటించారు. పాకిస్తాన్ గెలవడంలో ఫకర్ జమాన్ ప్రముఖ పాత్ర పోషించాడు. 63 బంతులలో 6 ఫోర్లు, 9 సిక్స్ లు కొట్టి 100 పరుగులు చేయడం జరిగింది.