NewsOrbit
Cricket న్యూస్

సలీం దుర్రానీ: అర్జున అవార్డు అందుకున్న తొలి క్రికెటర్, దూకుడుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఆల్రౌండర్… సలీం దుర్రానీ కన్నుమూత

Salim Durani సలీం దుర్రానీ
Share

సలీం దుర్రానీ: క్రికెట్ లెజెండ్ మాజీ భారత ఆల్రౌండర్ సలీం దుర్రానీ కన్నుమూత, ఇటీవలే ‘ప్రాక్సిమాల్ ఫెమోరల్ నైల్ సర్జరీ’ అనే శస్త్రచికిత్స చేయుంచుకున్న 88 ఏళ్ల సలీం దుర్రానీ గుజరాత్ లో మరణించారు. అర్జున అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ గా సలీం దుర్రానీ కి భారత క్రీడా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

సలీం దుర్రానీ అనే పేరు వినగానే క్రికెట్ అభిమానులకి 1961-1962 లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ గుర్తొస్తుంది. కోల్‌కతా మరియు చెన్నైలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచులలో 8 ఇంకా 10 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పై భారత్ గెలవడానికి ప్రత్యక్షంగా కారణం అయ్యాడు.

ఆ తరువాత 1971లో వెస్ట్ ఇండీస్ లో జరిగిన టెస్ట్ మ్యాచులో క్లైవ్ లాయిడ్ ఇంకా గ్యారీ సోబర్స్ వికెట్స్ వెనువెంటనే తీసి వెస్ట్ ఇండీస్ లో భారత్ మొదటి సారి టెస్ట్ మ్యాచ్ గెలిచేలా చేసాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో 17 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి సంచలనం సృష్టించాడు.

సిక్స్ మెషిన్ గ పేరుతెచ్చుకున్న సలీం దుర్రానీ చాలా దూకుడుగా బాటింగ్ చేసేవాడు, ఇతని ఆల్రౌండర్ ప్రతిభకు ఎంతోమంది మంత్రముగ్దులు అయ్యేవారు. 1973 కాన్పూర్ టెస్ట్ స్క్వాడ్ నుంచి సలీం దుర్రానీ ని తొలగించినప్పుడు అభిమానులు ‘నో దుర్రానీ నో టెస్ట్!’ అంటూ నిరసన చేయడం ఆయనకున్న క్రేజ్ కి నిదర్శనం.

క్రికెట్ క్రీడ లోనే కాదు బాలీవుడ్ లో నటించిన అనుభవం కూడా ఉంది దుర్రానీ కి. 1973 లో చరిత్ర అనే సినిమాలో పర్వీన్ బాబీ సరసన నటించి అందరిని అలరించాడు.

29 టెస్ట్ మ్యాచులు ఆడిన దుర్రానీ కేవలం 1 టెస్ట్ సెంచరీ మాత్రమే సాధించాడు. 1962లో వెస్ట్ ఇండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచులో 104 పరుగులు సాధించి 1 టెస్ట్ సెంచరీని తన కాతాలో వేసుకున్నాడు. అయితే డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం 33 సగటు పరుగులతో 14 సెంచరీలు సాధించాడు. భారత దేశం క్రికెట్ లో తొలి అడుగులు వేస్తున్న రోజుల్లో తన ఆల్రౌండర్ ప్రదర్శనతో దేశం గర్వించదగిన క్రీడాకారుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నాడు… దేశం లో క్రికెట్ ఎదగడానికి తాను చేసిన సహకారం గుర్తిస్తూ భారత్ ప్రభుత్వం సలీం దుర్రానీ కి అర్జున అవార్డు ఇచ్చి సత్కరించింది… బీసీసీఐ 2011లో సలీం దుర్రానీ కి ప్రతిష్టాత్మక సి.కే నాయుడు లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు ఇచ్చింది. దేశం కోసం ఇంకా క్రికెట్ కోసం ఇంత చేసిన సలీం దుర్రానీ మనల్ని వదిలి వెళ్లిపోవడం బాధాకరం, తనకు తుదిసారిగా వీడ్కోలు చెప్తూ న్యూసార్బిట్ నుండి ఈ ప్రత్యేక కథనం.

Salim Durani: ప్రముఖ క్రికెటర్ సలీం దురానీ మృతి

 


Share

Related posts

Meghali Meenakshi latest photos

Gallery Desk

Currency Notes Destroyed: చిత్తు కాగితాలైన రూ.2.50 లక్షల నోట్లు..! స్పందించిన మంత్రి కేటిఆర్..! మేటర్ ఏమిటంటే..?

bharani jella

“పుష్ప 2” కి సంబంధించి వచ్చిన ఆ వార్త నిజమే క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్ టీమ్ మెంబర్..!!

sekhar