Virat Kohli: ఇండియన్ క్రికెట్ టీం స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్ మీద ఉన్నాడు. టి20 వరల్డ్ కప్ కీ ముందు చెత్త ప్రదర్శనతో చాలా సతమతమవడం జరిగింది. కోహ్లీ ఆట తీరుపై తీవ్రస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రకరకాల చర్చలు జరిగాయి. ఇంకా మళ్ళీ ఫామ్ లోకి వచ్చే పరిస్థితి లేదని విమర్శకులు కామెంట్లు చేయడం జరిగింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేసి టి20 వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో కీలకమైన మ్యాచులలో విరాట్ విజృంభించాడు. ఆ తర్వాత నుండి బంగ్లాదేశ్, శ్రీలంక ఇంకా ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ లలో వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్న విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఎకౌంటులో ఓ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరో కనిపెట్టండి..? అని నెటిజన్లను కోరాడు. అంతేకాదు ఆ ప్లేయర్ తనకు తెలుసని… నా అంచనా రీతిలో మీలో ఎవరు కనిపెడతారో .. చూస్తా అని పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో పుమా క్రికెట్ అకౌంట్ పేరిట ఉంది. దానిలో ఓ వ్యక్తి క్రికెట్ ప్యాడ్స్ కట్టుకొని… క్రీజ్ లోకీ వస్తున్నాడు. కేవలం రెండు అడుగులు.. అది కూడా వికెట్ల దగ్గర మాత్రమే. ఆ ప్లేయర్ యొక్క ,ముఖం కూడా చూపించలేదు. బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో… ఇండియా టీం చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది.
ఈ తరంలో అద్భుతమైన ఆటగాడు, 100 t20 మ్యాచ్ లు ఆడి… 100 స్ట్రైక్ రేట్ తో ఉన్న వ్యక్తి బరిలోకి దిగాడు అంటూ వాయిస్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ వీడియో చూసిన చాలామంది నేటిజెన్ లు ప్రస్తుతం ఇండియా టీంలో 100 t20 మ్యాచ్ లు ఆడిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకరు విరాట్.. మరొకరు రోహిత్ శర్మ. వీరిద్దరిలో ఒకరు అయ్యుండొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆ వీడియోలో ఉన్నది తానే. కావాలని విరాట్ కోహ్లీ ఈ రీతిగా గేమ్ ఆడుతున్నాడు అని కామెంట్లు పెడుతున్నారు. మరోపక్క పుమా క్రికెట్ కంపెనీ.. ట్విట్టర్ అకౌంట్ ఈ వీడియోకీ పుమ కంపెనీకీ కొత్త అంబాసిడర్.. వస్తున్నాడు.. అని హెడ్డింగ్ పెట్టి పోస్ట్ చేసింది. దీంతో విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన ఈ పుమ క్రికెట్ అకౌంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Someone special is taking the crease 🏏
Can you guess PUMA’s newest ambassador? Drop in the replies ⬇️ pic.twitter.com/dzNGUEc07A— PUMA Cricket (@pumacricket) January 28, 2023