28.2 C
Hyderabad
February 4, 2023
NewsOrbit
Cricket

Mankading: క్రికెట్ గేమ్ లో “మంకడింగ్” అవుట్ అంటే ఏమిటి…? ఫస్ట్ మంకడింగ్ ఔట్ ఎవరు చేశారో ఫుల్ డీటెయిల్స్..!!

Share

Mankading: ప్రపంచంలో ఫుట్ బాల్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన గేమ్ క్రికెట్. ఇంగ్లాండ్ లో పుట్టిన గాని…ఈ క్రికెట్  ఎక్కువ భారతీయులు ఆస్వాదించే ఆట. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశం కావటంతో ఇండియా టీమ్ మ్యాచ్ ఆడుతుంది అంటే… భారీ ఎత్తున బిజినెస్ జరుగుద్ది. ఇప్పటివరకు రెండుసార్లు ఇండియా ప్రపంచ కప్ గెలవడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే క్రికెట్ గేమ్ పరంగా కొన్ని నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా హైలెట్…వివాదాస్పదం అవుతూ ఉంటాయి. అటువంటి వాటిలో “మంకడింగ్” ఒకటి. “మంకడింగ్” అంటే బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బంతి విసరకుండానే.. నాన్ స్ట్రైకర్ బ్యాట్స్మెన్ క్రీజ్ దాటే క్రమంలో… బౌలర్ ఒక్కసారిగా రన్ అవుట్ చేయడం. చాలా సందర్భాలలో ఈ అవుట్ చర్చనీయాంశంగా మారింది.

 What is Mankading and out originate in the game of cricket Full details
Mankading in Cricket History

క్రికెట్ నిబంధనలకు విరుద్ధం అన్న వాదన కూడా వినిపించింది. 2019 ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ ఆటగాడిని రవిచంద్రన్ అశ్విన్ మంకడింగ్ విధానం ద్వారా అవుట్ చేయడం తెలిసిందే. ఆ సమయంలో క్రీడా స్ఫూర్తిగా ఇది చాలా విరుద్ధమని మాజీ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పాంటింగ్ లాంటివారు కామెంట్లు చేశారు. కానీ అదే సమయంలో సీనియర్ స్టార్ క్రికెటర్ గవాస్కర్, డాన్ బ్రాడ్మన్ వంటి లెజెండ్ ఆటగాళ్లు సమర్ధించడం జరిగింది. నిబంధనల ప్రకారం ఇలా అవుట్ చేయడం తప్పేమీ కాదని వెనకేసుకొచ్చారు. “మంకడింగ్” విధానం ద్వారా బ్యాట్స్మెన్ అవుట్ చేయడం తప్పని… చెప్పేవాళ్లు వికెట్ బదులు బ్యాటింగ్ జట్టుకి పరుగుల కోత విధించాలి అన్న డిమాండ్ అప్పట్లో తెర పైకి తీసుకొచ్చారు.

 What is Mankading and out originate in the game of cricket Full details
Mankading Out
“మంకడింగ్” లీగల్ అవుట్ గానే పరిగణిస్తూ..ICC రూల్ పాస్

బౌలర్ క్రీజ్ దాటి నోబెల్ వేస్తే ఫ్రీ హిట్టు ద్వారా ఏ రకంగా రూల్  పెట్టారో… అదే రీతిలో బౌలర్ బంతిని వేయకుండానే నాన్ స్ట్రైకర్ క్రీజ్ దాటి ముందే పరుగులు తీస్తే ఐదు పరుగులు తగ్గించాలి. అటు బౌలర్ అదే రీతిలో ఇటు నాన్ స్ట్రైకర్ కీ ఒకే రకమైన సమాన అవకాశం ఉండాలి.. అని చాలామంది చెప్పుకు రావడం జరిగింది. “మంకడింగ్” అనేది క్రికెట్ గేమ్ లో ఒక పెద్ద వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో గత ఏడాది మంకడింగ్ అవుట్ పై.. ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. “మంకడింగ్” లీగల్ అవుట్ గానే పరిగణిస్తూ.. రూల్ పాస్ చేసింది. ఈ రకంగా అవుట్ అయితే మంకడింగ్ అవుట్ లా కాకుండా… రన్ అవుట్ కింద వస్తుందని స్పష్టం చేసింది. అసలు ఈ మంకడింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది చూస్తే… మాజీ భారత క్రికెట్ ఆటగాడు వినో మంకడ్ నుండి.

 What is Mankading and out originate in the game of cricket Full details
Vinoo Mankad
వినో మంకడ్..

వినో మంకడ్ అస్సలు పేరు ముల్వంట్రై హిమ్మటల్. పూర్తి విషయంలోకి వెళ్తే 1947 ఆస్ట్రేలియాతో ఇండియా ఆడుతున్న మ్యాచ్ లో ముల్వంట్రై హిమ్మటల్ మంకాడ్… అలియాస్ వినో మంకడ్ బౌలింగ్ చేస్తూ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న స్టార్ బ్యాట్స్ మ్యాన్.. బిల్ బ్రౌన్..నీ ఫస్ట్ మంకడింగ్ తరహ అవుట్ చేయటం జరిగింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా మీడియా వినో మంకడ్ ను… దుమ్మొత్తి పోసింది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా గేమ్ ఆడుతున్నాడని విమర్శలు చేయడం జరిగింది. దీంతో అప్పటినుండి వినో మంకడ్ పేరు మారుమ్రోగటం…”మంకడింగ్” ఔట్.. వివాదాస్పదం స్టార్ట్ అయింది. వినో మంకడ్ ఇండియన్ క్రికెట్ విభాగంలో మెయిన్ ప్లేయర్. అంతేకాదు మొదట వెయ్యి పరుగులు చేసిన ఆటగాడుగా 100 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. 1952లో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 72 తర్వాత 184 పరుగులు చేసి.. ఐదు వికెట్లు తీసి.. మ్యాన్ అఫ్ దీ మ్యాచ్ గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ విభాగంలో ఆల్ రౌండర్ గా వినో మంకడ్ తనకంటూ చరిత్రలో కొన్ని పేజీలు క్రియేట్ చేసుకున్నాడు.


Share

Related posts

షకీబ్‌ అల్‌ హసన్‌ విజృంభణ: IND Vs BAN మ్యాచ్ లో కుప్పకూలిన భారత్ బ్యాటింగ్, బంగ్లాదేశ్ పై కే.ల్ రాహుల్ ఒంటరి పోరాటం

Deepak Rajula

T20 WC 2022: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీస్ లో భారత్…పాకిస్తాన్ టీమ్స్..!!

sekhar

వన్డే చరిత్రలో భారత్ మరో ఘనత .. శ్రీలంక పై భారత్ ఘన విజయం

somaraju sharma