నారసింహం.. నరసింహ.. తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఈస్వామి అత్యంత శక్తివంతమైన విష్ణురూపం, అవతారంగా భావిస్తారు. ఈ స్వామికి ఈ నేలకు అవినాభావ సంబంధం.
దేశంలో అత్యధిక నారసింహ క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయనడంలో సందేహం లేదు. ఆయా రూపాలలో స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు. అయితే స్వామిని ఆయా మంత్రశాస్త్రాలలో 32 రకాలుగా పేర్కొన్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం..
ఆ రూపాల జాబితా…
1. కృష్ణ నరసింహుడు
2. రుద్ర నరసింహుడు
3. మహా గోర నరసింహుడు
4. భీషణ నరసింహుడు
5. భీమ నరసింహుడు
6. ఉజ్జ్వల నరసింహుడు
7. కరాళ నరసింహుడు
8. వికరాళ నరసింహుడు
9. దైత్యాంక నరసింహుడు
10. మధుసూదన నరసింహుడు
11. రక్తాక్ష నరసింహుడు
12. పింగళాక్ష నరసింహుడు
13. అంజన నరసింహుడు
14. దీప్త తేజ నరసింహుడు
15. విశ్వాక్ష నరసింహుడు
16. రాక్షసాంతక నరసింహుడు
17. విశాఖ నరసింహుడు
18. ధూమ్రకేశ నరసింహుడు
19. హయగ్రీవ నరసింహుడు
20. ధనస్వన నరసింహుడు
21. మేఘనాథ నరసింహుడు
22. మేఘవర్ణ నరసింహుడు
23. కుంభకర్ణ నరసింహుడు
24. తీవ్ర తేజ నరసింహుడు
25. అగ్నివర్ణ నరసింహుడు
26. మహోగ్ర నరసింహుడు
27. విశ్వభూషణ నరసింహుడు
28. విఘ్నక్రమ నరసింహుడు
29. మహాసేన నరసింహుడు
30. సుకోణ నరసింహుడు
31. సుహాను నరసింహుడు
32. శృశాంతక నరసింహుడు.
ప్రతీ రోజు ఈ 32 అవతార రూపాలను మనస్సులో స్మరించుకుంటే చాలు స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.