తులసీ.. సనాతనధర్మంలో పవిత్రమైన చెట్టు. ఇది దాదాపు ప్రతీ హిందువు ఇంట్లో ఉంటుంది. అయితే తులసీదళాలు పవిత్రమైనవిగా భావిస్తాం. వీటిని ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు. ఆ నియమాలు తెలుసుకుందాం..
అమావాస్య నాడు ఏ పూలు కోయకూడదు, ఏ చెట్టు నరకకూడదు. ఆదివారం, శుక్రవారం తులసి దళాలు కోయరాదు. అలాగే ద్వాదశి తిథినాడు తెంపరాదు. సోమ, మంగళ, బుధ, గురువారాలలో కోయవచ్చు కానీ మంగళవారం చతుర్దశి, షష్టి, అష్టమి తిథి వచ్చినపుడు తులసీదళాలను తెంపరాదు. నిత్యపూజలో ఉపయోగించే పూలు ఒక పూట లేదా రోజులో వాడకుంటే తర్వాత రోజుకు పనికిరావు.కానీ తులసీ దళాలలు కోసిన రోజు నుంచి ఏడాది వరకు వాడవచ్చు.ఇవండి తులసీదళాలు తెంపడంలో నియమాలు. వీటని పాటించి శ్రీవిష్ణు, లక్ష్మీదేవతల అనుగ్రహం పొందండి.