Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలానుగుణంగా గ్రహాల గమనంలో మార్పు వస్తుంది. ప్రేమ, సంపదను ఇచ్చే శుక్రుడు రేపు ఫిబ్రవరి 15న మీన రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. దీనివలన అరుదైన మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగాన్ని శుభకరమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏ ఏ రాశుల వారి భవిష్యత్తు బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మిధునం
ఈ యోగంలో ఈ రాశి వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. గురుడు హాన్స్ అనే రాజయోగాన్ని చేస్తున్నాడు. దాంతో వీళ్ళు ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపార నిమిత్తం కానీ ఏదైనా పనిమీద కానీ బయటకు వెళ్లే అవకాశం ఉంది.
కన్యారాశి
మాలవ్య రాజయోగం వీరికి అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఈ రాజయోగం ఏర్పడనుంది. అంతేకాకుండా ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. భార్య భర్తల బంధం అన్యోన్యంగా బలపడుతుంది. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి.
వృషభ రాశి
శుక్ర గ్రహం మేలు చేస్తుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ జాతకంలో ఇప్పటికే బృహస్పతి ఉన్న 5వ ఇంట్లో సంచరిస్తుంది .మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది.
ధనస్సు రాశి
వీరికి కూడా ఈ రాజయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం మీ సంచార జాతకంలో నాలుగవ ఇంట్లో ఉంటుంది. లగ్జరీ లైఫ్ లో మీరు లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈ సమయంలో మీరు లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే పాలిటిక్స్ లో ఉన్నవారికి మంచి పదవి దక్కుతుంది.