Avoid: చాలామంది వారికి తెలియకుండానే అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని తప్పులు వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందని కొంతమంది హెచ్చరిస్తున్నారు. అందుకే దరిద్రాన్ని ఆహ్వానించే ఆ పనులను చేయవద్దని సలహా ఇస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం చక్కగా ఇల్లు నిర్మించుకున్నప్పటికీ వాస్తు నియమాలను పాటించకపోతే ఇంట్లో కొన్ని చెడు అలవాట్లు మరియు కుటుంబ సభ్యులు మార్చుకోకపోతే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నష్టాలను చూడాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అలవాట్లో పొరపాటుగా చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది.అందుకే దరిద్రాన్ని ఆహ్వానించే ఆపనులను చేయవద్దని సలహా ఇస్తున్నారు. కుటుంబ పురోగతికి ఆటంకం కలిగించే చెడ్డ అలవాట్లు ఇవే… వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే సానుకూల సానుభూతి ఆ ఇంటికి శ్రేయస్సును సంతోషాన్ని తీసుకువస్తుంది. ఇక ప్రతికూల శక్తి జీవితంలో అనేక శక్తులను తెస్తుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించడానికి ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల అలవాట్లు కూడా కారణం అవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే కుటుంబ పురోగతికి ఆటంకం కలిగించే ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యే కొన్ని అలవాటులను మార్చుకోవాలని సూచిస్తున్నారు.
ఇక అలాంటి వాటిలో ముఖ్యమైన కొన్ని చెడ్డ అలవాట్లను ప్రస్తుతం మనం తెలుసుకుందాం..
బద్ధకం: చాలామంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోరు. ఇల్లు ఎప్పుడూ మురికిగా ఉంటుంది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం పాత సామాన్లు విరిగిపోయిన వస్తువులు దర్శనం ఇస్తాయి. బాత్రూంలో కూడా అశుభ్రంగా దర్శనమిస్తాయి. దీనికి కారణం వారిలో ఉండే బద్ధకం.
మంచం పై కూర్చుని భోజనం చేయకూడదు. అలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టను చెప్పులను పెట్టకూడదు.
భోజనం చేసిన తర్వాత పాత్రలను ఎప్పటికప్పుడు కడిగేయాలి. వంటగదిని అశుభ్రంగా ఉంచకూడదు. కొంతమంది పాదాలను నేలకు రాస్తూ ఉంటారు. ఇలా పాదాలను నేలకు రాస్తున్నడడం వల్ల శని ప్రవేశిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మంచం మీద కూర్చుని కాళ్లు ఊపడం వల్ల చాలా ఆర్థిక సమస్యలకు గురి అయ్యి సతమతమవుతూ ఉంటారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.