దైవం

Marriage : పెళ్లి జరిగేటప్పుడు వరుడు ఈ ఈ  విషయం లో అప్రమత్తం గా లేకపోతే  మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త !!

Theft in Marriage: Viral Case in Toopran Marriage
Share

Marriage : పుణ్యం
మామగారు, అల్లుడి పాదాలు కడుగుతుంటే చాలా ఆనందంగా,  ఫోటోలు ,వీడియోలు  వంక,   చూడడం వంటివి  చేయకూడదు . తనకంటే వయసులో పెద్దాయన తన కాళ్ళు కడుగుతున్నాడు అంటే ,తాను చేసుకున్న పుణ్యం అంతా తగ్గిపోతుంది.  కాబట్టి, ఆ సమయంలో మయి, మయి, యశోమాయి అని ఒక చిన్న శ్లోకం చదువుకోవాలి. పెళ్లి చేసే బ్రహ్మ గారిని అడిగితే ఆయన చెబుతారు. ఈ విషయం వరుడి తండ్రి  వరుడికి చెప్పుకోవాలి .

Marriage : తరుణోపాయం

అలా అల్లుడి కాళ్ళు  కడగడం  పూర్తి అయిన తరువాత కన్య ను  సాలం క్రుత కన్యాదానం చేయాలి .  ఆడపిల్ల ని   కన్యాదానం సమయంలో సాధ్యమైనంతవరకు వడ్డాణము, చెవికి తాటంకాలు, ముక్కుపుడక పెట్టి మరి  కన్యాదానం చెయ్యాలి.అందరి ఆడపిల్లల తండ్రులు అంత ఆర్థిక పరమైన శక్తి  కలిగి ఉండరు.  మన సనాతన ధర్మము, శాస్త్రం   దీని కోసం నీవు ఊరంతా అప్పులు చేసి ఇవన్నీ పెట్టాల్సిందే అని అనదు. మనకు తరుణోపాయం ఏవిటో కూడా తెలియజేస్తుంది. పైగా, కన్యాదానం   చాలా పెద్ద దానం కూడా . అందుకే కదా పిల్లలు లేనివారు కన్యాదానం చెయ్యాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే కన్యాదాత కన్యాదానం కంటే ముందు దశదానాలు  చేయవలసి ఉంటుంది.

భార్య స్థానం

మరి అంత శక్తి లేనివారు కన్యాదానం చేసే ముందు వధువు చేతిలో పూర్ణ ఫలం అయినటువంటి , కొబ్బరి బొండం చేతిలో  పెట్టి దానిమీద గుమ్మడి పండు, దీనిపై మంచి గంధపు చెక్క పెట్టి కన్యాదానం చేయడం వలన  కన్యాదాత దశదానాలు చేసి సాలంకృత కన్యాదానం చేసిన ఫలితం పొందుతారు. ఈ పూర్ణ ఫలం తో ఉన్న అమ్మాయి చేతి ని వరుడి  దోసిట్లో పెట్టి సన్నటి నీటి ధార     భార్య పోస్తుండగా కన్యాదాత కన్యాదానం చేస్తారు. సామాన్యంగా భార్య, భర్తకు ఎడమ చేతి పక్కన కూర్చుంటుంది. కానీ, కొన్ని విశేష క్రతువులు  జరిగేటప్పుడు మాత్రం  భార్య స్థానం మారి..ఆవిడ ఆ సమయంలో భర్తకు  కుడివైపుకి వస్తుంది.


Share

Related posts

Today Horoscope: సెప్టెంబర్ 28 – బాద్రపదమాసం -రోజువారీ రాశి ఫలాలు

somaraju sharma

రెండో రోజు బెజవాడలో అమ్మ రూపం ఇదే !

Sree matha

అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలు ఇవే !

Sree matha
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar