వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత ను మించిన పాఠం లేదని మీకు తెలుసా??

Bhagavad Gita as a tool for personality development
Share

Bhagavad Gita: భగవద్గీత అనగా అది ఏదో మతానికి సంబంధించిన, సన్యాసులు లేదా వయసు అయిపోయిన వారు చదివే గ్రంధము గా చూస్తారు. కానీ చిన్ననాటి నుండి పిల్లలకు గీతాసారం వంటబడితే.. జీవితంలో ఉన్నతమైన వ్యక్తులు గా మిగులుతారు.ఇప్పుడు మానసిక నిపుణులు కూడా వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత ను మించిన పాఠం లేదని తెలియచేస్తున్నారు. అసలు భగవద్గీత లో ఏముందో తెలుసుకుందాం.

Bhagavad Gita as a tool for personality development
Bhagavad Gita as a tool for personality development

భగవద్గీత లో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా బ్రతకాలి ? మంచి మార్గంలో ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక శ్రేయస్సు కు ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు చెప్పబడ్డాయి. ఇందులోని అంశాలు చదివి ఆచరిస్తే జీవితం తో పాటు లోకం కూడా స్వర్గధామం గా ఉంటుంది. భగవద్గీత కేవలం ‘పారాయణ గ్రంథం’ కాదు, ‘అనుష్టాన గ్రంథం’ అంటే ఊరికే శ్లోకాలు చదివి పక్కన పెట్టేయడం కాదు నిత్యం చదివి అందులోని అంశాలను అన్వయించు దగినది అని గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత అంటే కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్య శాస్త్రం, ఆహార విజ్ఞానశాస్త్రం, నైతిక ధార్మిక శాస్త్రం. ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం గా చెప్పవలసిందే

మనిషి జీవితం లో ఉండే అన్ని విషయాలు ఇందులో చర్చించబడ్డాయి. అందువల్ల భగవద్గీత ను ‘మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం’ గా చెబుతారు. గీతలోచెప్పబడిన ఉపదేశాలను ప్రతి వ్యక్తి తన నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత కచ్చితంగా ఉన్నత స్థితికి చేరుకుంటుంది. విషయాలు విపులీకరించి ఉన్నాయి. వాటిని తెలుసుకొని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు.ప్రస్తుత మానవ జీవితం పూర్తిగా భౌతిక దృక్పథాన్ని కే పరిమితమైంది.

స్వార్థమే గొప్పతనం అనుకుంటూ,మనశ్శాంతి లేక మనిషి కాలం గడుపుతున్నాడు. ఈ విధానం మారాలంటే, మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతి తో జీవించాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి.ఈ ఆధ్యాత్మిక చింతనకు వయస్సుతో పనిలేదు చిన్నప్పటినుండి మొదలు పెట్టవచ్చు. జీవితం లో ఆధ్యాత్మికంగా అటువంటి మార్పు కావాలనుకునేవారు తమ నిత్యజీవిత వ్యవహారాల్లో భగవద్గీత కూ చోటు ఇవ్వాలి.


Share

Related posts

Food, ఈ సమయాలలో  ఆహారం  తీసుకుంటే చాల తేలికగా బరువు తగ్గుతారు !!

Kumar

కేసీఆర్‌ను కెలికిన అచ్చెన్నాయుడు…ఏం జ‌ర‌గ‌నుందో?

sridhar

చర్మ సౌందర్యం అనేది ఆడవారి సొంతమా?? మరి మగవారి చర్మం సంగతి?

Kumar