Statues: ప్రస్తుత కాలంలో కూడా చాలామంది వాస్తును ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకున్నప్పుడే ఎటువంటి సమస్యల నుంచి అయినా బయటపడవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్యకాలంలో వాస్తును అనుసరిస్తూ.. ఇంటిని నిర్మించుకోవడం.. ఇంటిలోని వస్తువులను ఏర్పాటు చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి.. శాంతి చేకూరుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే కొన్ని రకాల విగ్రహాలను ఇంట్లో తప్పకుండా పెట్టుకోవాలి.

మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి విగ్రహాలు లేదా వస్తువులు ఉంటే మన ఇంటికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సాలిడ్ సిల్వర్ లేదా కంచు తో తయారు చేసిన ఏనుగులు ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచిది. ఇవి ఉంటే ఎప్పుడు ధనం మీ ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదు ఏనుగు విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ముఖ్యంగా ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉన్న బెడ్రూంలో పెట్టుకుంటే వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఇక అంతే కాదు వాస్తు శాస్త్రం ప్రకారం గుర్రం బొమ్మను కూడా ఇంట్లో ఉంచడం చాలా మంచిదట.
చాలామంది తమ జీవితంలో ఎన్నో పనులు చేసినప్పటికీ అందులో ముందుకు వెళ్లలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు గుర్రం విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే సక్సెస్ పొందుతారు. అంతేకాదు జంట హంసలను కూడా ఇంట్లో ఉంచితే ఎల్లప్పుడూ కుటుంబం ఆనందంగా ఉంటుంది.కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయి. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విగ్రహాలను మీ ఇంట్లో ఉంచినట్లయితే కచ్చితంగా అదృష్టం మీ ఇంటే ఉంటుంది.