దీపావళి ముందు వచ్చే త్రయోదశిని ధన్తేరాస్ అంటారు. అయితే అసలు ధన్తేరాస్ అనేది ధన్వంతరి జన్మదినం. దీని వివరాలు తెలుసుకుందాం…
‘ధన్వంతరి జననం పరిశీలిస్తే.. దేవతలు, రాక్షసులు చేసిన సముద్ర మంథనంలో నుండి జరిగినది. నాలుగు చేతులున్న ధన్వంతరి ఒక చేతిలో ‘అమృత కలశము’, మరో చేతిలో ‘జలగ’, మూడవ చేతిలో ‘శంఖము’ మరియు నాలుగవ చేతిలో ‘చక్రము’ వీటితో జన్మించాడు. ఈ నాలుగు చేతులలో వున్న వాటిని ఉపయోగించి అనేక వ్యాధులను, రోగములను నయము చేసే కార్యము భగవాన్ ధన్వంతరి చేస్తాడు.
ధన్వంతరి పూజ – ఆయుర్వేదమనుసారంగా ఈ దినమును ధన్వంతరి జయంతి అని అంటారు. వైధ్యులు ఈ రోజున ధన్వంతరిని (దేవుళ్ళ వైద్యుడు) పూజిస్తారు. సన్నగా తరిగిన వేపాకు ముక్కలను మరియు చక్కెరను ‘ప్రసాదంగా’ అందరికి పంచుతారు. దీనికి గొప్ప అర్థమున్నది. అమృతము నుండి వేప వ్యుత్పన్న మైనది. ధన్వంతరి అమృత తత్వాన్ని ప్రసాదించే దేవత అని దీనినుండి అర్థం అవుతుంది. 5-6 వేపాకులను ప్రతి రోజు తినడముతో వ్యాధులు అయ్యే అవకాశము ఉండదు. వేపకు ఇంత ప్రాముఖ్యత కలదు. అందుకే వేపాకును ఈ రోజున ధన్వంతరి ప్రసాదమని ఇస్తారు.