Plant : మూఢనమ్మకం
ఇంటి ముందు ప్రవేశ ద్వారం దగ్గర అవకాశం ఉంది కదా అని మునగ చెట్టు ఎప్పటికీ పెంచకూడదు. ఈ మునగ చెట్టు ఇంటికి ఎడమ భాగంలో లేదా మీరు ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు కనపడే స్థలంలో నాటుకుని పెంచుకోవచ్చు. ఈ విషయాన్ని చాలామంది మూఢనమ్మకం అని అనుకుంటూ ఉంటారు. కానీ దీని ప్రభావం కచ్చితంగా ఆ ఇంటి మీద ఉంటుంది. మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Plant : నిద్ర లేచిన వెంటనే దాన్ని
కొందరు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు మొదట చాలా అభివృద్ధి చెంది తర్వాత హఠాత్తుగా నష్టం వచ్చి దివాళా తీసే పరిస్థితి కలుగుతుంది. ఇలా జరగడానికి కారణం వారు వారి ఇంటి ముందు తెలిసో తెలియక మునగ చెట్టు పెంచి ఉంటారు అనేది కూడా ఉంటుంది. మునగ చెట్టు ప్రభావం భార్యాభర్తల మీద కూడా పడుతుంది. పెళ్లి అయిన భార్య భర్తల మధ్య సరైన అవగాహన లేక అనుమానపు జీవితం గడుపుతూ రోజు గొడవలు పడుతూ ఉండడం జరుగుతుంది. ఆనందంగా ఉండాలిసిన వారి జీవితం నరకంగా ఉంటుంది. ఎవరి ఇంటి ముందు ఈ ములగ చెట్టు ఉండి నిద్ర లేచిన వెంటనే దాన్ని చూస్తూ ఉండే వారికి ఎప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆఖరకు పిల్లలు కూడా అనారోగ్యం బారిన పడుతుంటారు. వీటితో పాటు కుటుంబంలో మనస్పర్ధలు, గొడవలు ఇతర సమస్యలు ముద్ర వస్తుంటాయి.మూలగా చెట్టు ఆలా ఉన్నా ఇంట్లో దరిద్ర దేవత స్థిరం గా ఉంటూనే ఉంటుంది. అంతే కాదు అనుకున్న ఏ పనులు జరగవు. ఏ పని కోసం బయటకు వెళ్ళిన ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. మునగ చెట్టు ఇంటి ముందు ఉండటం వలన అనర్థాలు జరుగుతూనే ఉంటాయి.
ఇంటి వెనుక
ఈ కారణం గానే మునగ చెట్టు ఇంటి ముందు ఉంటే ముప్పు అని ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఇంటి లోపలి వచ్చేటప్పుడు గాని మునగ చెట్టును చూడకూడదు అని చెప్పారు పెద్దలు. కనపడని, అంతగా ఎవరు చూడని, తిరగని ప్రదేశంలో మాత్రమే ఈ చెట్టుని పెంచుకోవాలి.ఒకవేళ మీ ఇంట్లో ములగ చెట్టు ఉంటే ఒక ఆదివారం రోజున కొట్టి మీ ఇంటి వెనుక స్థలం పాతిపెట్టాలి. అలా చేసేటప్పుడు ఓం వృక్షరాజా నమస్తేస్తుత్ అభిష్ట ఫలదాయిని అని అనుకుంటూ చేయడం వలన ఎటువంటి దోషాలు అంటవు.