దైవం

Pilgrimages : తీర్ధయాత్రలు  ఏ వయస్సులో  చేయాలో తెలుసా?ఈ వయస్సులో చేయడం వలన  గొప్ప ఫలితాలు పొందుతారు !!

Share

Pilgrimages : వృద్ధాప్యంలోనే వెళ్లాలని:
తీర్ధ యాత్రలకు ,ఆలయాలకు ,సత్సంగాలకు వెళ్లాలంటే వృద్ధాప్యం రావాలని ఎదురుచూస్తుంటారు కొందరు. పడుచువారు ఎవరైనా ఈ ప్రదేశాలకు వెళ్తుంటే కూడా అప్పుడే ఎందుకు దానికి ఇంకా చాలా సమయం ఉంది అని సలహా ఇస్తుంటారు. అసలు ఇవన్నీ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. తీర్థయాత్రలకు వృద్ధాప్యంలోనే వెళ్లాలని చాలా మంది భావిస్తుంటారు. అదే విధం గా బాధ్యతలన్నీ పూర్తిచేసిన తర్వాత తీర్థయాత్రలకు బయల్దేరుతుంటారు కూడా.

నిజానికి  తీర్థయాత్రలు చేయడానికి,  భగవంతుడి నామస్మరణ చేయడానికి ,భగవత్ కార్యాలు చేయడానికి భక్తి మార్గం లో వెళ్ళడానికి వయ్యస్సుతో అస్సలు సంబందం లేదు అని   ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.  భగవంతుడి దర్శనం,  నామస్మర, పూజాభిషేకాలు,సేవలు చేయడం వలన వ్యక్తి  అనంతమైన పుణ్యఫలితాలను పొందుతాడు అనేది ఎవరు కాదనలేని సత్యం.
కాబట్టి స్వామిని దర్శించుకునేందుకు వయస్సును అడ్డు పెట్టకుండా … వయస్సున్నప్పుడే  తీర్థయాత్రలకు వెళ్లడం మంచిది అని  ఆధ్యాత్మిక నిపుణులు  తెలియచేస్తున్నారు.

 Pilgrimages : శక్తి ఉండడం వలన :

ఇలాంటి కార్యక్రమాల వలన సమస్త దోషాలు  తొలగడం తో పాటు కోరిన కోరికలు నెరవేరి
సంతృప్తికర జీవితం  పొందుతారు అని తెలియచేస్తున్నారు.   వయస్సు ఉండగా అయితే ఒంట్లో ఓపిక చేతిలో డబ్బు ఎలాంటి వాతావరణం లో అయినా ఇమడగలిగే శక్తి ఉండడం వలన మనసంతా దైవం మీద మాత్రమే పెట్టగలుగుతారు. మీక్కూడా  ఇబ్బంది అనిపించదు. మీ వాళ్లకి ఇబ్బంది ఉండదు. అదే బాధ్యతలు తీరిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్తే మాత్రం అనారోగ్య సమస్యలతోబాధలు   తప్పవు. అన్ని వాతావరణాలలో మీరు ఇమడలేక పోవచ్చు.   ఒంట్లో ఓపిక సన్నగిల్లి దైవం మీద మనస్సు పెట్టలేరు.  కాబట్టి అనుకున్న క్షేత్రానికి  అనుకున్నట్టు ఆలస్యం చేయకుండా వెళ్లి రావాలి. వయ్యస్సులో వీలైనన్ని తీర్ధ యాత్రలు చేసి .. వృధాప్యం లో వాటాన్నిటిని గుర్తు చేసుకుంటూ దైవాన్ని స్మరిస్తూ కాలాన్ని గడపాలి తప్ప అప్పుడు ప్రయాణాలు చేయకూడదు అని ఆధ్యాత్మిక గురువులు తెలియచేస్తున్నారు.

జీవితం లో దృఢం గా ఉండడం:

వయస్సున్నప్పుడే తీర్థయాత్రల్లో  చేయడం వలన సుప్రసిద్ధ ఆలయాలకు వెళ్లడం ద్వారా దోషాలన్నీ తొలగిపోయి..అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పడం జరిగింది.   వివాహం, సంతానానికి సంబంధించిన దోషాలు,కుటుంబ చిక్కులు  సైతం తొలగిపోతాయి.ఎలాంటి కష్టాన్ని అయినా తట్టుకుని జీవితం లో దృఢం గా ఉండడం కూడా వస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అందుకే వయస్సున్నప్పుడే..పవిత్ర క్షేత్రాలు,యోగులు,మహర్షులు,మహాభక్తులు,సిద్ధులు నడయాడిన ప్రాంతాల్లో తీర్థయాత్రల కు వెళ్ళాలి అని   ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.


Share

Related posts

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ !

Sree matha

Today Horoscope డిసెంబర్ 7th సోమవారం రాశి ఫలాలు

Sree matha

Hindu traditions: మన సంప్రదాయం లో చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఇది !!

Kumar