గాయత్రి మంత్రం సాక్షాత్తు సకల దేవత స్వరూపం ఈ మంత్రం. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు ఆరాధించిన మాత గాయత్రి. అయితే ఈ మంత్రం ఏ వేదంలో ఉందో తెలుసుకుందాం…
గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము ‘గయ’ మరియు ‘త్రాయతి’ అను పదములతో కూడుకుని ఉన్నది. “గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ” అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. ‘గయలు’ అనగా ప్రాణములు అని అర్థము. ‘త్రాయతే’ అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించారు.