దైవం

Deeparadhana : మీరు దీపారాధన కోసం ఈ కుందులు వాడుతున్నారా??దీపం  వెలిగించడానికి అగ్గిపుల్లను వాడుతున్నారా?

Share

Deeparadhana తల పెట్టిన
ఆవు  నెయ్య,  కొబ్బరి నూనె నువ్వుల నూనె , పొద్దుతిరుగుడు నూనెతో  వెండి తో చేసిన ప్రమిద లో దీపారాధన  చేసే  వారు ఇంట్లో   అష్టనిధుల ను పొందుతారు. గణపతికి, లక్ష్మినారాయణ స్వామికి శ్రీ గాయత్రీమాతకు,లలితాత్రిపురసుందరీ అమ్మకి, రాజరాజేశ్వరి అమ్మ వారికిసాల గ్రామములకు,  దీపం కోసం వెండి ప్రమిదెలు వాడటం          వలన    తల పెట్టిన  పనులన్నీ    సమయానికి  పూర్తవుతాయి.దీపంలోనే దేవతలందరూ కొలువై ఉంటారు. దీపం వెలిగించిన  వెంటనే  ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు అంటూ ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత  దీపం పెట్టినట్టే ,సాయంత్రం స్నానం చేసి తర్వాత కూడా దీపం వెలిగించాలి .

Deeparadhana  నేలపై

సాయంత్రం స్నానం చేయలేక పొతే మాత్రం..కనీసం కాళ్ళూ, చేతులు, ముఖమూ, నోరు కడుక్కుని అయినా  దీపారాధన చేసుకోవాలి.  మాంసాహారం తినే వారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయక్కరలేదు.  మామూలు స్నానం చేసిన  సరిపోతుంది. దీపం  పెట్టె    ప్రమిద    బంగారపుది , వెండి తో చేసినది  , ఇత్తడిది తో చేసినది ,పంచలోహాలు లేదా  మట్టిదైనా అయి  ఉండవచ్చు. ఇనుప,లేదా స్టీలు ప్రమిదలో దీపారాధన  ఎప్పుడు వెలిగించకూడదు.అలాగే  దీపపు ప్రమిదను  నేరుగా  నేలపై పెట్టడం అనేది మంచి పద్దతి కాదు.అలా పెట్టడం అనేది  దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. దీపం క్రింద ఒక చిన్న ఇత్తడిమట్టి  మట్టీ ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై మాత్రమే  ప్రమిద ఉంచాలి.  దీపారాధన చేసే ముందు రెండు పూటలా కూడా ఇల్లు  శుభ్రం గా ఊడ్చి ఉంచుకోవాలి. శుభ్రం గా ఉన్న  ప్రదేశంలో మాత్రమే దీపం పెట్టాలి. దీపారాధన చేసే  స్థలం లో మాత్రం  కాసిన్ని నీటితో తుడిచి శుభ్రం చేసి , బియ్యపు పిండితో చిన్న ముగ్గు అయినా వేసి  కాస్త    పసుపుకుంకుమా చల్లి, అప్పుడు దానిమీద   ప్రమిద పెట్టి, దీపం  వెలిగించుకోవాలి .

వెలిగించడానికి, ముందుగా

ప్రమిదలో ఉన్న వత్తిని  వెలిగించడానికి, ముందుగా వేరే చిన్నవత్తినిలేదా  హారతి కర్పూరాన్ని  వెలిగించి దానితో,
మాత్రమే ప్రమిదలో వేసిన  వత్తిని  వెలిగించాలి.  దీపారాధన ఒక వత్తితో చేయకూడదు.   ఎందుకంటే అది అశుభసూచకం గా భావిస్తారు.  రెండు లేదా మూడు ,5 ఇలా   వెలిగించాలి.  దీపారాధానకు ఆవునెయి వాడటం అనేది  ఉత్తమం, దాని తర్వాత తరువాత నువ్వులనూనె,కొబ్బరి నూనెతో కూడా వెలిగించ వచ్చు. దీపారాధన చేసిన తర్వాత  ప్రమిదకు గంధం తో పాటు కుంకుమ పెట్టి,  పువ్వులు పెట్టి      సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కారం చేసుకోవాలి .
నిత్యం రెండు పూటల దీపారాధన చేసేవారి ఇంట లక్ష్మీదేవి  ఎప్పటికి నిలిచే ఉంటుంది. దీనితో పాటు దుష్ట శక్తులు ఆ ఇంటి పరిసరాల్లోకి   కూడా రాలేవు.


Share

Related posts

Today Horoscope డిసెంబర్ 13th ఆదివారం రాశి ఫలాలు

Sree matha

Today Horoscope ఏప్రిల్ 15 – చైత్రమాసం- గురువారం. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు !

Sree matha

Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు !

Sree matha