Marriage : ఒత్తిడిని తగ్గించి పెళ్ళి తర్వాత జీవితాన్ని అద్భుతంగా మార్చే సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. అంచనాలు : ఈ ప్రపంచం లో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ప్రతిరోజు మనల్ని మనం మార్చుకుంటూ మరింత ఉన్నతమైన వ్యక్తిగా మారుతూ ఉంటాం . అదే మీ భాగస్వామి విషయం లో కూడా వర్తిస్తుంది. కాబట్టి పెళ్లితో మన జీవితం లో కి అడుగు పెట్టె వ్యక్తి మీద కాస్త తక్కువ అంచనాలు ఉండటం అనేది ఆనందకరమైన జీవితానికి మొదటి మెట్టుగా చెప్పవచ్చు.
2.అంగీకరించడం: అంగీకరించడం ఒకే విషయాన్ని పది మంది పది రకాలుగా చూస్తారు. మన భాగస్వామి అయినంత మాత్రాన మనకున్న అభిప్రాయమే తనకి కూడా ఉండాలి అని ఏమి లేదు.అది తప్పు ఏమాత్రం కాదు. వారికీ జీవితం వేరే కోణం లో అర్ధం అయి ఉండవచ్చు. వాళ్లకు ఉన్న విలువలు, అలవాట్లు, సిద్ధాంతాలు వేరు కావచ్చు. కాబట్టి మనం వాళ్ళని అంగీకరించడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే జీవితం ఆనందంగా ఉంటుంది.
3. గౌరవించుకోవడం : తమ కుటుంబ సభ్యుల్నిఅగౌరవం గా మాట్లాడటాన్ని ఎవరు ఒప్పుకోరు. మీ భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల్ని మీరు గౌరవించి,ఆదరించినప్పుడు మాత్రమే మీకు తగినంత విలువ ఉంటుంది.
4. ముఖ్యమైన విషయం : మీ భాగస్వామిని అభినందించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి సందర్భానుసారం గా ఒకర్ని ఒకరు అభినందించుకోవడం వలన మీ బందం మరింత గట్టి పడుతుంది.
5. బంధాలు దెబ్బ : పెళ్ళిలో ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉండడం సహజం. అలాంటప్పుడు గౌరవంగా అభిప్రాయాన్ని తెలియచేయాలి. ఎక్కడన్నా అగౌరవం గా సమాధానం చెప్పడం జరిగితే బంధాలు దెబ్బ తింటాయి. నిజం చెప్పాలి అంటే ప్రేమ కన్నా గౌరవం పెళ్ళిని మరింత దృఢంగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మారుస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
6. ఇంటిని నడపడం : ఇంటిని నడపడం అనేది ఇద్దరికీ కూడా బాధ్యతలో కూడుకున్న విషయం. కాబట్టి ఇద్దరూ కూర్చుని వీటిని చక్కగా ప్లాన్ చేసుకోవాలి. . మీ ఇద్దరు కలిసి ఈ పనులను పంచుకుంటే మీ ఇంటి బాధ్యతలను చాలా తేలికగా చేసుకోవచ్చు.
7. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం : మన భాగస్వామి మన మనసులో ఏముందో తెలుసుకుని దానికి తగ్గట్టు ఉండాలని మనం కోరుకుంటాం. అది సాధ్యం కాదు ఎందుకంటే మన మనసులో ఏముందో తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి మీ కావలసినదాన్ని మీరే చెప్పండి. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం వలన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
8. సమయం : ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి కాస్త టైం పడుతుంది. తొందరపడ కుండా వేచి చూడండి .
9. ఏకాంతం : మీ భాగస్వామికి ఇష్టమైన పని చేయడానికి వాళ్ళకంటూకాస్త సమయం ఇవ్వండి. మీ భాగస్వామికి పెళ్ళికి ముందు హాబీలు, స్నేహితులు ఉంటాయి కదా పెళ్లి తర్వాత కూడా వాటికి తగిన సమయం ఇచ్చేలా చేయడం చాలా అవసరం
10. స్నేహం :. పెళ్లి తర్వాత జీవితం ఆనందకరంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ కన్నా కూడా స్నేహం ఉండడం వలన మీ బందం మరింత పటిష్టంగా ఉంటుంది.