Festivals in February 2023: నేటి నుంచి మనం 2023 వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అడుగుపెడుతున్నాం. పంచాంగం ప్రకారం ఫిబ్రవరి నెల మాఘ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిధితో మొదలై పాల్గొనమాసంలోని శుక్లపక్షం నవమిదితో ముగుస్తుంది. ఈ నెలలో మనం జరుపుకోబోయే పండుగలు వాటి విశేషాలు రోజు ఉపవాసం ఉంటారో ఇప్పుడు చూద్దాం..

ఫిబ్రవరి 1: జయ, భీష్మ ఏకాదశి ఈరోజున శ్రీ మహా విష్ణువుని పూజించడంతోపాటు ఉపవాసం ఉండాలని నియమం ఉంది ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల మన యొక్క పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని పూర్వీకులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 2 గురు ప్రదోష వ్రతం:
ఈ నెలలో గురువారం ప్రదోష వ్రతం వస్తుంది దీనిని గురుప్రదోష వ్రతం అని పిలుస్తారు.
ఫిబ్రవరి 5 మాఘ పూర్ణిమ – పౌర్ణమి, గురు రవిదాస్ జయంతి:
మాఘ పూర్ణిమ రోజున గంగాస్నానం చేయడం మంచిదని.. మనిషికి రోగాలు దూరమవుతాయనీ ప్రతీతి. ఈ రోజు నువ్వులను దానం చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. అలాగే ఇవాళ భక్తి మార్గాన్ని అనుసరించడం నేర్పిన సెయింట్ రవిదాస్ పుట్టినరోజును జరుపుకుంటారు..
ఫిబ్రవరి 9 ద్విజప్రియ సంకష్ట చతుర్థి:
సంకష్ట చతుర్థి నాడు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేస్తే మన కష్టాలు తొలిగి మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.
ఫిబ్రవరి 12 యశోద జయంతి: శ్రీకృష్ణుని తల్లి యశోద జన్మదినాన్ని ఈ రోజు జరుపుకుంటారు. యశోదాను పూజించడం వల్ల జీవితంలో శుభం కలుగుతుందని ప్రజల నమ్మక్కం.
ఫిబ్రవరి 13 కుంభ సంక్రాంతి, శబరి జయంతి, కాలాష్టమి: సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటూ ఫిబ్రవరిలో మకరరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున శివుడు కాలభైరవుని ఉగ్రరూపంలో ఆరాధిస్తారు, ఆ దేవుడిని పూజిస్తే శత్రువులపై విజయం పొందుతారు .
ఫిబ్రవరి 17 విజయ ఏకాదశి: ఈ గొప్ప పుణ్య వ్రతం పాటించడం ద్వారా వాజపేయి యాగ ఫలం లభిస్తుంది. విజయ ఏకాదశి దాని పేరు ప్రకారం శత్రువులపై విజయాన్ని ఇస్తుంది.
ఫిబ్రవరి 18 శనివారం మహాశివరాత్రి, మాస శివరాత్రి, ప్రదోష వ్రత, శని త్రయోదశి: మహాశివరాత్రి పర్వదినం శివుడు, శక్తి కలిసిన రోజు. నేడు శివ పార్వతుల కల్యాణం జరిగింది. మహా శివరాత్రి రోజున 12 జ్యోతిర్లింగాలు దర్శనమిచ్చాయని కూడా చెబుతారు.
ఫిబ్రవరి 20 సోమవతి అమావాస్య:
సోమవారం వచ్చే అమావాస్య రోజునే సోమవతి అమావాస్య అంటారు. ఈ రోజున వివాహిత స్త్రీలు అశ్వత్థామ వృక్షాన్ని పూజిస్తారు. అలాగే వారి భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. సోమవతి, శని అమావాస్య చాలా ముఖ్యమైనవి.
ఫిబ్రవరి 21 రామకృష్ణ జయంతి: ఈ రోజును రామకృష్ణ పరమహంస జయంతిగా అంతా జరుపుకుంటారు.
ఫిబ్రవరి23 వినాయక చతుర్థి, ఫిబ్రవరి 25 శనివారం స్కంద షష్ఠి , ఫిబ్రవరి 27న సోమవారం హోలాష్టక ప్రారంభం, మాస దుర్గాష్టమి, రోహిణి ఉపవాసం. హోలీకి ఎనిమిది రోజుల ముందు హోలాష్టక జరుగుతుంది.