దైవం

Gold : బంగారం తాకట్టు లో  ఉన్నా.. బంగారం తాకట్టు పెట్టాలన్న ఈ నియమాలు పాటిస్తే  బంగారం త్వరగా విడిపించుకుంటారు !!

Share

Gold : మనలో చాలా మందికి బంగారం ఉంటుంది. కొందరు వాటిని శుభకార్యాలకు అలంకరించుకుంటూ ఉంటారు. మరి కొందరి బంగారం మాత్రం పరిస్థితుల కారణం గా తాకట్టులో ఉంచవలిసి వస్తుంది.కొందరు తాకట్టు పెట్టిన కొన్ని రోజులకు తిరిగి ఇంటికి తెచ్చుకుంటారు కానీ,మరి కొందరి బంగారం మాత్రం సంవత్సరాలు తరబడి తాకట్టులోనే ఉండిపోతుంటుంది. అంతే కాదు ఒకసారి తాకట్టు పెట్టి రాగానే మళ్ళి త్వరలోనే ఇంకొంత బంగారం తాకట్టు పెట్టవల్సి వస్తుంటుంది. అస్సలు బంగారం తాకట్టు పెట్టడానికి కొన్ని నక్షత్రాలు ఉంటాయి.

ఆ నక్షత్రాలు ఉన్నప్పుడు కొన్ని నియమాలు పాటిస్తూ బంగారం కానీ తాకట్టు పెడితే మళ్ళి వెంటనే విడిపించుకోవచ్చు. ఇవేమి పట్టించు కోకుండా తాకట్టు పెట్టేస్తే మాత్రం బంగారం విడి పించుకోలేము సరి కదా వదిలేసుకోవాలిసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నియమాలు అనుసరించి జాగ్రత్త  పడండి.  భరణి ,మృగ శిర ,మఖ ,స్వాతి ,అనురాధ ,రేవతి  ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు మనం బంగార తాకట్టు పెడితే మళ్ళి వెంటనే విడిపించుకుని తీసుకు వచ్చే  శక్తి మనకు వస్తుంది. బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్ళేటప్పుడు ముఖ్యం గా గుర్తుపెట్టుకోవాలిసిన విషయం ఏమిటంటే తాకట్టు పెట్టె బ్యాంకు లో కి కానీ ,షాప్ లోకి కానీ వెళ్ళినప్పుడు మెయిన్ డోర్ లో ముందుగా ఎడమ కాలు పెట్టి లోపలకి   అడుగు పెట్టాలి. తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని బయటకు  వచ్చేటప్పుడు  మెయిన్  డోర్  బయట కుడి కాలు  పెట్టి రావడం వలన   బంగారం త్వరగా విడిపించుకుంటారు.

అలాగే బంగార విడిపించుకుని ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి కాలు పెట్టి ఇంట్లోకి ప్రవేశించాలి. ఇలా చేస్తే  మళ్ళి బంగారం తాకట్టు పెట్టవలిసిన అవసరం  పెద్దగా రాదు. తాకట్టు నుండి తెచ్చిన బంగారం  గళ్ళు ఉప్పు   నీటిలో వేసి ఆ నీటితో  శుభ్రం చేసుకుని బీరువాలో పెట్టుకోవాలి, ఈ పరిహారం తో మళ్ళి తాకట్టు పెట్టవలిసిన అవసరం లేకుండా బంగారం మీ దగ్గరే ఉంటుంది . తాకట్టులో ఉన్న బంగార త్వరగా విడిపించుకోవడానికి   హస్త నక్షత్రం ఉన్నరోజు ఎంతోకొంత    డబ్బు  జమేస్తూ  ఉంటే తాకట్టు బంగారం త్వరగా పూర్తిగా  విడిపించినుకునే  అవకాశం వస్తుంది.     ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాలిసిన ఇంకొక విషయం ఏమిటంటే   ఏల్నాటి శని నడుస్తున్నవారు మాత్రం ఎప్పుడు బంగారం తాకట్టు  పెట్టకుండా ఉండడం మంచిది.


Share

Related posts

Today Horoscope సెప్టెంబర్ 3rd గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

Daily Horoscope జూలై 14 మంగళవారం మీ రాశి ఫలాలు

Sree matha

ఆగస్టు 29 – బాద్రపద మాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma