NewsOrbit
దైవం

దక్షిణాయనం ప్రారంభంలో ఇలా చేస్తే మంచి ఫలితాలు !

 

జూలై 16 – ఆషాఢ బహుళ ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ఆరంభమవుతుంది. సాధారణంగా సూర్యుడు ప్రతి మాసంలోను ఒకరాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ వుంటాడు.

 

దీనినే సంక్రమణ కాలం అని అంటూ వుంటారు. అలా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి, మకరరాశిలోకి ప్రవేశించేంత వరకూ గల కాలాన్ని ‘దక్షిణాయణం’ అంటారు. దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయణం రాత్రిగా చెప్పబడుతోంది. అందువలన పగటి కాలమైన ఉత్తరాయణంలో శుభకార్యాలు, దైవకార్యాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కాలమంతా కూడా వివిధ రకాల వేడుకలతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తూ వుంటుంది. ఇక దేవతలకు రాత్రి భాగంగా చెప్పబడుతోన్న దక్షిణాయణం పితృదేవతలకు ప్రీతికరమైనదిగా చెబుతుంటారు. అందువల్లనే ఈ సమయంలో పితృకార్యాలనే తప్ప, దైవకార్యాలుగాని జరపరు. అయితే దక్షిణాయణం ఆరంభంలో పుణ్యస్నానాలు చేయడం, దేవతారాధన చేయడం మంచిదని శాస్త్రం చెబుతోంది. సంక్రమణ కాలంలో చేసే పుణ్యస్నానాల వలన … దేవతారాధన వలన ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేస్తోంది. ఇక దక్షిణాయనంలో వచ్చే బాద్రపదమాసంలో పితృపక్షాలు చాలా ప్రాశ్యస్తం కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఈ కాలంలో అనేక పండుగలు వస్తాయి. పవిత్రమాసాలు వస్తాయి. బాద్రపద వినాయకచవితి, ఆశ్వీజమాసం అమ్మవారి నవరాత్రులు, దసరా, దీపావళి, కార్తీకం, మార్గశీర్షం ఈ దక్షిణాయనంలోనే వస్తాయి.

author avatar
Sree matha

Related posts

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 4 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju