Good Signs: హిందూమత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవిని సంపదల దేవతలగా పరిగణిస్తారు. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని సంతోషంగా ఉంటామని తమ ఇల్లు సంపదతో నిండి ఉంటుందని నమ్ముతారు. మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగు పెట్టిన చోటల్లా శుభ ఫలితాలు మరియు శుభసంకేతాలు వస్తాయా చాలామంది నమ్ముతారు. లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే దనం కొరత అనేది ఉండదు. ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభసంకేతాలను తీసుకొస్తుంది. అయితే అవేంటో తెలుసుకుందాం…

మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం, ఏదైనా వస్తువులను ఒక్కసారిగా గుంపుగా తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే దానివల్ల మీకు ఆ శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒక చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం. ఇది చాలా శుభసంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే అది శుభసంకేతంగా పరిగణిస్తారు.
మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం. మీకు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు, గుడ్లగూబ, ఏనుగు, ముంగిస, శంఖం, బల్లి, నక్షత్రం, పాము, గులాబీ వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగెందుకు సంకేతంగా భావిస్తారు. ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతున్నందుకు సంకేతం.