NewsOrbit
Featured దైవం

వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి !

  •  జూలై 31 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం

  • ప్రతీ ఏటా శ్రావణమాసం పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు. అష్టైశ్వర్యాల్ని ప్రసాదించే వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఎంతో విశిష్టమైన వ్రతం. వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే ఐశ్వర్యం, విద్య, కీర్తి, శాంతి, ఆనందం ఇలా సమస్త ఐశ్వర్యాలు లభిస్తాయి. దక్షిణాది రాష్ట్రాల్లో విశేషంగా అష్టలక్ష్మి స్వరూపమైన వరలక్ష్మి పూజ దిగ్విజయంగా చేస్తారు. అష్టైశ్వర్యాలకు ప్రతీక అయిన వరలక్ష్మి వ్రతవిధానం ఎంతో విశిష్టమైనది. అనాదిగా ఆచరిస్తున్నది. శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం ఇది. పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం శ్రీమహాలక్ష్మిని వరలక్ష్మి పేరుతో అర్చించటం సంప్రదాయం. ఈసారి జూలై 31న వరలక్ష్మీ వ్రతం ఆచరించుకోవాలి.

 

అష్టలక్ష్మి అవతరాలు 

Hindu goddess | Hindu deities, Kali goddess, Hindu gods

  • సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి. వరలక్ష్మి.

  • జూలై 31న ఏం చేయాలి ?

  • అమ్మవారి వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండ పంపైన బియ్యం పిండితో అష్టదళపద్మాన్ని ముగ్గుగా వేసి కలశం ఏర్పా టు చేసుకోవాలి. అమ్మవారి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని చీర, పుష్పా లు, ఆభరణాలతో అలంకరించి పూజాసామాగ్రిని సిద్ధం చేసుకో వాలి. తోరాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. అక్షింతలు, హరిద్రగ ణపతి (పసుపుతో చేసిన) వినాయకుని సిద్ధం చేసుకోవాలి….

Varalakshmi Pooja Decoration Ideas 5 - Pooja Room and Rangoli Designs

 

కావలసిన వస్తువులు

పసుపు, కుంకుమ, ముత్తయిదువులకు వాయనం ఇచ్చేందుకు అవసరమైన వస్తువులు, ఎర్రని రవికె వస్త్రం, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరణానికి దారం, టెంకాయలు, దీపపు కుందులు, పంచహారతి అమ్మవారికి ఇచ్చేందుకై ఐదువత్తులు, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరవత్తులు, బియ్యం, సెనగలు.

తోరం ఎలా సిద్ధం చేయాలి

తెల్లని దారం ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పువ్వులను కట్టి ముడులు వేయాలి. ఈ దారాన్ని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు కుంకుమ, అక్షింతలతో పూజించాలి. ముందుగా గణపతిని పూజించి, కలశపూజ, ధ్యాన ఆవహన, శోడశోపచరలతో శ్రీవరలక్ష్మిదేవికి అష్టోత్తర శతనామావళిని పఠించి అర్పించి దీప, ధూప నైవేద్యాలను సమర్పించాలి. తరువాత శ్రీవరలక్ష్మి వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుని ముత్తయిదువులకు తాంబులాలు ఇవ్వాలి. అందరికీ తీర్ధప్రసాదాలు ఇచ్చి అమ్మవారి నైవేద్యాన్ని ప్రసాదంగా ఆరగించి రాత్రి భోజనం చేయరాదు. ఇది వ్రత విధానం.

 అన్ని లక్ష్మి ఆలయాలలో విశేష కుంకుమార్చనలు, పుష్పార్చనలు జరుగుతాయి. ధన, కనక వస్తు వాహనది సంవృద్ధికి మూలదేవత వరలక్ష్మిదేవి. చారు మతి అనే ఆమెకు కలలో మహాలక్ష్మి ఉపదేశించిన ఈ వ్రతాన్ని ముత్తయిదువులు ఆచరించి శుభ, సౌఖ్య, సంపదల్ని పొందుతారు. వరలక్ష్మీదేవి ప్రీతికరమైన పుష్పాల్ని, అర్చనకు వినియోగిస్తారు.

    జాజి, పోక, పొన్న, పొగడ, మల్లె, చేమంతి, పద్మాలు వంటి పుష్పాలతో, మాచీపద్రం, మరువం, మారేడు, తులసీ, విష్ణుక్రంద పత్రాలతో పూజిస్తే అమ్మ అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల విశ్వాసం. సకల శుభాలు, సర్వ ఐశ్వర్యాలతోపాటు సౌభాగ్యానికి ప్రతీక అయిన వరలక్ష్మి వత్రం ముత్త యిదువులకు అత్యంద ప్రీతిపాత్రమైన, యోగకరమైన వ్రతంగా చెప్పబడింది.                                                                                                                                                                                            ఈసారి కరోనా కారణంగా ఎవరి ఇంట్లో వారు శ్రద్ధతో, భక్తితో నిరాడంబరంగా నిజాయితీతోకూడిన భక్తితో అమ్మవారి వ్రతం ఆచరించుకోండి. అనవసరంగా వాయినాలు, ఆడంబరాలు, పేరింటాల పేరుతో జనసందోహాలను ఏర్పాటు చేయకండి. శుభప్రదమైన వ్రతాన్ని ఆచరించడానికి భక్తి, శ్రద్ధ అవసరం.                                                                                                                                              మీకు ఏది లభ్యం అయితే వాటితోనే వ్రతాన్ని ఆచరించండి. అదిలేదు, ఇది లేదు అని బాధ పడకండి. అమ్మవారిని కరోనా పోగుట్టి లోకకళ్యాణం చేయమని వరాన్ని అడగండి.

author avatar
Sree matha

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju