Rohini Nakshatra Taurus Zodiac Sign: శాస్త్ర సాంకేతికంగా మానవుడు పరుగులు తీస్తున్నా భారతదేశంలోని ప్రజానీకం ఎక్కువ మంది ముఖ్యంగా హిందు సాంప్రదాయం ఆచరించే వారు అనేక సందర్భాల్లో తిధులు, వార, నక్షత్రాలు చూసుకోవడం, శుభ ముహూర్తాలు చూసుకోవడం జరుగుతుంటుంది. జన్మ నక్షత్రం బట్టి వారి మస్థత్వతం ఎలా ఉంటుంది. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రోహిణి నక్షత్రం గురించి తెలుసుకోవాలంటే ..
వృషభ రాశి పది డిగ్రీల నుండి 23 డిగ్రీల 20 నిమిషాల వరకూ వ్యాపించే నక్షత్రాన్ని రోహిణి అని అంటారు. రోహిణి నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ. నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు దివ్య చింతనతో పాటు లౌక్యము ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్నది ఎలాగైనా సాధించుకుంటారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృడత్వం కల్గి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ అధిక్యత సాధిస్తారు. సాహస క్రీడల్లో ఆకర్షితులై ప్రావీణ్యతను సాధిస్తారు. వీరి జీవితంలో స్త్రీ ల అధిక్యత, అండదండలు ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్థాయలు అదనపు అర్హతల వల్ల మంచి ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. దూర ప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాలలో రాణిస్తారు. అధునాతన విద్యలలో రాణిస్తారు. భూసంపద కలిగి ఉంటారు. వీరికి త్వరగా కోపం రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారము ఈ నక్షత్ర జాతకులకు కలిసి వస్తుంది. అపనిందులు, అరోపణలు జీవితంలో వీరికి ఒక భగం అవుతాయి. జీవితంలో ఒడిదుడుకులు సహజంగా ఉంటాయి. వీరు హస్య, కళా ప్రియులు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్న విధంగా తమ సంతానాన్ని తీర్చిదిద్దుతారు.

రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి రాహు, శని, కేతువుల కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. వీరు చంద్ర – శాంతి హోమం, శుక్ర – శాంతి హోమం చేయించుకోవడం ద్వారా ప్రతికూలతలను నివారించుకోవచ్చు. అదే విధంగా ప్రతి రోజు దుర్గా సూక్తం వినడం, సోమవారాలు ఉపవాసం లాంటివి పాటిస్తే మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. వీరు ఓం ప్రజాపతయే నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలాలు పొందుతారు.
రోహిణి నక్షత్ర జాతకులకు అదృష్ట రాయి ముత్యం. అనుకూలమైన రంగులు తెలుపు, గంధపు రంగు. రోహిణికి అరుద్ర, పుష్య, మఘా, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం నక్షత్రాలు ప్రతికూలమైనవి. అందుకని రోహిణి నక్షత్ర జాతకులు ఆ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.