Interruptions : చక్కని పరిష్కారం:
ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆటంకాలతో ఆగిపోవడం, రావలసిన డబ్బులు,
ఉద్యోగాలు,లాభాలు చేతివరకు వచ్చి అందకుండా పోతున్నాయ?
అయితే మీరనుకున్న పనులన్నీ నెరవేరడం కోసంచక్కని పరిష్కారం తెలుసుకోండి.
రెండు కుందె లు తీసుకుని అందులో కొబ్బరి నూనె పోసి ఒక్కొక్క కుందె లో 3 ఒత్తులు వేసి విఘ్నేశ్వరుడి దగ్గర ప్రతి రోజూ దీపం పెట్టాలి. దానితో పాటు బెల్లం నివేదన చేయాలి.అష్టోత్తరం చేయటానికి ఎర్రటి అక్షింతలు కానీ ,ఎర్రటి పూలతో కానీ,గరికతో కానీ చేయవచ్చు.
Interruptions : విఘ్నాలు కలిగించి,తొలగించేది:
పరిస్థితుల కారణం గా అష్టోత్రం చేసుకోలేనివారు ..ఓం శ్రీ వినాయకాయ నమః. అనీ 108 సార్లు పఠించాలి.
ఇలా చేయడం వలన విఘ్నేశ్వరుడు మనకి వచ్చిన ఆటంకాలు , విఘ్నాలు తొలగిస్తాడు.
గణపతికి ఎన్నో,ఎన్నెన్నో రూపాలు ఉన్నాయి అన్నసంగతి మనందరికీ తెలుసు .
అయితే దానిలో విఘ్నరాజాధీపతి అయిన వినాయక రూపం అయితే విఘ్నాలు కలిగించి
తొలగించేది కూడా ఆయనే. కాబట్టి మన పనిలో ఆటంకాలు తొలగిపోవడానికి
ఓం శ్రీ వినాయకాయ నమో నమః అనీ స్మరించుకుంటూ ఉండాలి. విఘ్నేశ్వరుడికి ఎర్రని పువ్వులు ప్రీతికరమైనవి.
కాబట్టి ఆయనకి చాలా ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ, గరికతో గణపతి స్తోత్రం చదివి నైవేద్యంగా బెల్లం పెట్టడం వలన శుభాలుకలుగుతాయి.
గరికతో పూజ:
గణపతికి ప్రతిరోజూ గరికతో పూజ చేసుకోవడం వలన శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది.
అంతే కాదు గరిక పత్రాన్ని మీరు నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.గరికను తీసుకుని దారంతో కట్టి గణపతికి మాలగా వేస్తే మీ మనోగతమైన సమస్త కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు శక్తి కొలది ఆ గణపతిని ఆరాధించి జీవితాన్ని ఆనంద మయం గా చేసుకోండి.