New Year: కొత్త క్యాలెండర్ వచ్చేసింది.. 2022 ముగిసి కొత్త సంవత్సరం 2023లోకి అడుగుపెట్టాం.. చూస్తుండగానే 12 నెలలు గడిచిపోయాయి.. కొత్త సంవత్సరం కొందరికి సంతోషాన్ని తీసుకొస్తుంది.. అందులో భాగంగా ఈ ఏడాది నెంబర్ 6 ఉన్న వారికి కలిసొస్తుందట.. ఆ వివరాలు చూద్దాం..

న్యూమరాలజీ ప్రకారం 6, 15, 24వ తేదీలలో పుట్టిన నంబర్ 6 ప్రభావం ఉంటుంది. 6వ సంఖ్య కి అధిపతి శుక్రుడు. 2023వ సంవత్సరంలో వీరు కెరీర్ లో ముందుకు వెళ్తారు. ప్రేమ, కుటుంబ జీవితంలో శ్రేయస్సు ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యత ఉంటుంది. కుటుంబ సభ్యులకు అన్ని సౌకర్యాలను ఇవ్వగలుగుతారు. ఈ ఏడాది అందమైన ప్రదేశాలను, మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. అలాగే విలాసవంతమైన జీవనశైలిని కోరుకుంటారు. నెంబర్ 6వ అంకె ప్రభావం ఉన్నవారికి 2023 ఉత్తమంగా ఉంటుంది.
2023వ సంవత్సరం కెరీర్, ఆర్థిక వృద్ధికి సంబంధించి సగటు కంటే ఎక్కువగా ఉంటుంది. ముందస్తు ప్రణాళిక ఈ సంవత్సరం లాభాలను పెంచుతుంది. భాగస్వామ్యం కంటే మీ సొంత బిజినెస్ చేసుకోవడం మంచిది. మీరు జాబ్ చేస్తుంటే మీ పనితీరును అంచనా వేస్తారు. 2023లో ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తీసుకోవడం, ఇతరులపై గుడ్డి నమ్మకాన్ని తగ్గిస్తే విజయానికి వరిస్తుంది.
నంబర్ 6 ప్రభావం ఉన్నవారికి 2023వ సంవత్సరం రిలేషన్ లో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. అపార్థాలు తొలగడనికి బంధం బలోపేతం చేయడానికి స్పష్టమైన, సుదీర్ఘమైన సంభాషణ ఉత్తమ మార్గం. వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలి. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బు కంటే ముందు బంధాలు అనుబంధాలు గొప్పవి. సింగిల్స్ నవంబర్, డిసెంబర్ నెలల్లో నిజమైన ప్రేమను కనుగొనే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పటివరకు సహనం, వివేకం పాటించాలి. ఈ ఏడాది మీ సోషల్ స్టేటస్‌ను చూసి ప్రజలు అసూయపడతారు. అవేమీ పట్టించుకోకుండా మీ ప్రణాళికతో ముందుకు సాగండి.
చేయాల్సినవి..
శ్రీకృష్ణుడు, రాధకు కొబ్బరికాయ, మిశ్రి సమర్పించండి. తెల్లటి రుమాలు ఎల్లప్పుడూ మీతో ఉంచుకోండి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయండి. నాన్ వెజ్, లిక్కర్, పొగాకు, లెదర్‌కు దూరంగా ఉండండి. కలిసి వచ్చే రంగులు బ్లూ, పింక్. 6, 5ను అదృష్ట సంఖ్యలు. తూర్పు, ఉత్తరం ప్రయాణించండి. మీరు శుక్రవారం మొదలు పెట్టిన ఏ పనులైనా అత్యంత విజయవంతం అవుతాయి. ఈ సమాచారం కేవలం సోషల్ మీడియా కథనం ఆధారంగా తీసుకొని ఇవ్వబడింది.