NewsOrbit
దైవం న్యూస్

కరోనా ఎఫెక్ట్ : అమర్‌నాథ్ యాత్రకు రోజు 500మందికే అనుమతి

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు రోజుకు 500 మంది భక్తులను మాత్రమే అనుమతి ఇస్తామని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జమ్మూ-కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ అడ్వైజర్ ఆర్ ఆర్ భట్నాగర్, డీజీపీ దిల్బాగ్ సింగ్ అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. యాత్రికుల భద్రతా ఏర్పాట్లు ఇతర అంశాలపై సమీక్ష జరిపారు.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కేవలం రోజుకు 500 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తామని జమ్మూ-కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం శనివారం ప్రకటించారు. జమ్మూ నుంచి రోజుకు 500 మంది భక్తులు అమర్‌నాథ్‌కు వెళ్ళవచ్చని అయన తెలిపారు.

కరోనా ప్రభావం నేపథ్యంలో. జమ్మూ-కశ్మీరులో ప్రవేశించే భక్తులకు కోవిడ్-19 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వర్తిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సబ్ కమిటీతో అమర్‌నాథ్ యాత్ర కోసం జరుగుతున్న ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ శనివారం చర్చించారు. జమ్మూ-కశ్మీరులో ప్రవేశించే భక్తులు తప్పని సరిగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని, నెగెటివ్ రిపోర్టు వచ్చే వరకు క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు. గతంలో యాత్రికుల శిబిరాలుగా ఉపయోగపడిన భవనాలను ఈ ఏడాది క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగిస్తామని చెప్పారు.

అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ ఆలయం 3,888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. ఆ కాలంలోనే వేలల్లో భక్తులు కొండలు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!