Kumbha sankranti: కుంభ సంక్రాంతి.. అంటే నేడు సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.. దీనినే కుంభ సంక్రాంతి అంటారు. ఇప్పటికే శని దేవుడు అదే రాశిలో ఉన్నాడు. దీని కారణంగా కుంభరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడనుంది. మార్చి 14 వరకు సూర్యుడు ఇదే రాశిలో ఉంటాడు. సూర్యుడు, శని యొక్క ఈ కలయిక కొందరికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం.

సూర్యుడి సంచారం ఈ రాశులకు లాభదాయకం..
వృషభం
ఈ రాశి వారికి సూర్య సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. వీరి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి.
కన్య రాశి
ఈ రాశి వారికి సూర్యని సంచారం మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు అనుకూలమైన సమయం. మంచి లాభాలను వస్తాయి. ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో గుర్తింపు వస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి
సూర్యుడి గోచారం వల్ల ధనుస్సు రాశి వారికి చాలా లాభాలు కలుగుతాయి. వీరికి అన్ని రంగాలలో విజయం వరిస్తుంది యీ. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. నూతన ఉద్యోగం లో జాయిన్ అవ్వడానికి అనుకాలమైన సమయం.
కుంభ రాశి
ఈ రాశి వారికి శని, సూర్యుని కలయిక మంచి చేస్తుంది. ఈ రాశివారు జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. బిజినెస్ వ్యాప్తి చెందుతుంది. ఉద్యోగులుకు భారీగా ప్రయోజనాలు కలుగుతాయి. గతంతో పోల్చితే కెరీర్ అద్భుతంగా ఉంటుంది.