Maha Shivaratri: నేడు ప్రతి ఇంటిలోనూ శివనామ స్మరణతో మారుమూగిపోతుంది.. మహాశివరాత్రి పండుగకు ముందే రెండు గ్రహాల సంచారం ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించి, ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలోకి వెళ్లిపోయారు. మహా శివరాత్రికి ముందు ప్రధాన గ్రహాల రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా చెబుతున్నారు.. ఈ గ్రహాల సంచారం ఐదు రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు..

మిధున రాశి
మహాశివరాత్రి రోజు నుంచి ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రంగంలో మంచి లాభాలను గడిస్తారు. అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. సంఘంలో గౌరవం, ధైర్యం పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
సింహరాశి
వీరికి కూడా ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ప్రణాళికలు, వ్యూహాలు కచ్చితంగా విజయవంతం అవుతాయి. ఇక ఉద్యోగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందవచ్చు
విద్యారంగంలో కూడా బాగుంటుంది. పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసిన వారు శుభవార్త వింటారు.
కన్యారాశి
ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. అధిక ధన లాభాన్ని పొందుతారు. మీ ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. వైవాహిక జీవితంలోనూ మాధుర్యం ఉంటుంది.
ధనస్సు రాశి
వీరికి కూడా మహాశివరాత్రి నుంచి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. డబ్బు లావాదేవీలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అప్పుల్లో కూరుకుపోయిన వారు కూడా ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగ పరంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.
కుంభ రాశి
వీరి అదృష్టాన్ని ఈ రాశి గమనం మార్చేసింది. మీకు ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. డబ్బు ఆదా చేస్తారు. ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి.