ఐదోరోజు ఉదయం మోహినీ అవతారం !

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో శ్రీమలయప్ప స్వామి వారు మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. ఆ విశేషాలు…

బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిచ్చారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో దర్శనమిచ్చాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తన భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో స్వామి దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు.