Money plant: ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా సిరి సంపదలు వెల్లివిరుస్తాయని కొంతమంది విశ్వాసం మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు ఉండవని మరియు రుణబాధ్యతలు తీరిపోతాయని పెద్దలు అంటూ ఉంటారు. ఈ మనీ ప్లాంట్ మనకు డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వకపోయినా మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఆక్సిజన్ ను ఎల్లప్పుడు అందజేస్తుంది. కావున మనం ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్య కారణమైన మొక్కే ఈ మనీ ప్లాంట్..అయితే దీనికి ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు. దీనిని మన ఇంట్లో కూడా ఉంచుకోవచ్చును..

అయితే ఈ మనీప్లాంట్ ను ఎక్కడబడితే అక్కడ ఉంచరాదు. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలో మాత్రమే ఈ మొక్కను నాటాలి.. ఈ మనీ ప్లాంట్ మొక్కని పొరపాటున కూడా తూర్పు మరియు ఉత్తర, ఈశాన్యం దిశలలో ఈ మొక్కను పెంచరాదు. అలా ఉంచడం ద్వారా శుభాలకు బదులుగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఉన్నదంతా కరిగిపోవడమే కాకుండా ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ అనారోగ్యాన బారిన పడతారు..
మన ఇంట్లో ఈశాన్యవైపున ఎక్కువ బరువును కూడా ఉంచరాదు. మన ఇంట్లో శుభాలు కలగాలంటే తూర్పు, ఆగ్నేయ దిశలలో మాత్రమే ఈ ప్లాంట్ ని ఉంచాలి.. ఎందుకంటే ఆ దిశలో మాత్రమే ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ దిశలోనే ఉంచాలి. అంతేకాకుండా ఆగ్నేయ దిశలో విఘ్నేశ్వరుడు ఉంటాడని ఈ దిశకు వినాయకుడు అధిపతి. ఇంకా ఈ దిశకు శుక్రుడు ప్రాతినిథ్యం వహిస్తాడు. అయితే దీనిని బయట గోడలకు తీగ వాలేటట్టు పెంచరాదు. కుండీ లేదా ఒక గాజు సీసాలో నీళ్లు నింపి అందులో ఈ మొక్కను ఉంచాలి. దీని ఫలితంగా ఇంట్లోనే ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ మనీ ప్లాంట్ మొక్కకి ప్రతిరోజు కొంత నీటిని పోయాలి అలా చేయడం వలన మన ఇంటి పరిసరాలకు తగినంత శక్తిని ప్రవహిస్తుంది.ముఖ్యంగా పెంచిన వారికి మానసిక తృప్తిని కలిగిస్తుంది..