devotion : ముడుపులు ,మొక్కుబడులు నిర్లక్ష్యం చేస్తున్నారా ?

Share

devotion  ఈ ఆపద నుంచి
మనిషి  తన  జీవితం లో   ఎప్పుడు ఎదో ఒక  సమస్య ఆపదలు   , ఆవాంతరాలు     తీవ్రమైన  సమస్యలు   హఠాత్తుగా వచ్చి పడుతూనే ఉంటాయి. అలాంటి  దిక్కు తోచని పరిస్థితులలో   భగవంతుడిపైనే భారం వేయాల్సి ఉంటుంది.  ఈ ఆపద నుంచి కాపాడితే ,  డబ్బు లేదా బంగారం , హుండీలో వేస్తామని  మొక్కుకుంటారు.  ఇక  వచ్చిన  సమస్యల నుంచి  పరిష్కారం పొందినతర్వాత   వారికీ  అనుక్షణం మొక్కులు గుర్తుకు వస్తూనే ఉంటాయి.  కానీ  గండం గడిచిపోయింది  కదా నెమ్మదిగా మొక్కుబడులు  తీర్చేద్దాం అని అనుకుంటారు.  తామే    వెళ్లవలిసిన క్షేత్రానికి వెళ్లకుండా, అక్కడికి వెళుతున్న    తమ బంధుమిత్రులతో ఆ మొక్కుబడులను పంపించేస్తుంటారు.

devotion మొక్కుబడుల విషయంలో మాట తప్పిన

ఒక్కొక్కసారి  కానుకలు హుండీలో వేయమని  ఇతరులకు  ఇచ్చినప్పుడు,  వారు వేయకుండా మరిచిపోతుంటారు. ఇంకా కొందరు అయితే  ఆ సొమ్మును తమ సొంత ఖర్చులకు  ఖర్చు చేస్తుంటారు.   ఇంకొందరు సగం ఖర్చు పెట్టి మిగిలినది    మాత్రమే హుండీలో వేస్తుంటారు.  ఈ విధం గా  జరుగుతున్నా కూడా భగవానుడు  ఎవరినీ పల్లెత్తు మాట  అనని దయామూర్తి. ఆయన శిక్షించడు కూడా. తన బిడ్డేలే కదా అని దయచూపిస్తుంటాడు.  కానీ కొందరి భక్తుల అనుభవాల  ప్రకారం చూస్తే , మొక్కుబడుల విషయంలో మాట తప్పిన కారణంగా వారు  తగిన ఫలితాన్ని అనుభవించినట్టు తెలుస్తుంటుంది.


మొక్కుబడులు చెల్లించామని ఇస్తే  వాటిని   వాడుకుని ఆ దోష ఫలితాన్ని పొందిన వాళ్లు కూడా  చాలా మంది ఉన్నారు. మనం మొక్కుల రూపంలో చెల్లించే సొమ్ముకు భగవంతుడుఆశపడడు.ఆయనకే తరగని సంపద ఉంటుంది.క్షమించే హృదయం కూడా ఉంటుంది. కానీ అంత కష్టం నుండి బయట పడేసిన భగవంతుడి పట్ల మనకు కృతజ్ఞత లేకపోవడమే   మనకు  కష్టనష్టాలకు కారణమవుతూ ఉంటుంది. మనం ఎంత కృతజ్ఞత తో  ఉంటే అంతకు మించి  రెట్టింపు మంచి జరుగుతుంది.   కాబట్టి  మన సమస్య నుండి  బయట పడగానే … ఏదైతే దైవానికి మొక్కుకుంటామో దాన్ని  ఎలాంటి మార్పులు లేకుండా అనుకున్న సమయానికి భగవంతుడికి చెల్లించి కృతజ్ఞత తెలియచేయండి.

వెయ్యి ఏనుగుల బలాన్ని

మొక్కుబడిగా చెల్లించమంటూ ఇతరులు  మీకు  సొమ్మును  ఇచ్చారు అంటే మీరు  దేవుడికి ప్రతినిధి అని అర్ధం.  మీకు అంతకన్నా ఇంకా ఏమి కావలి ?  కాబట్టి ఎవరైనా మొక్కు చెల్లించడమంటే భగవంతుడి పట్ల భక్తిశ్రద్ధలను కనబరచడం.. ఆయన పట్ల  వేయమని ఇస్తే భక్తి  శ్రద్ధలతో ,ఆయనకోసం  పని చేసే అవకాశం వచ్చింది అనే ఆనంద  తో  ఆ సొమ్ము  హుండీలో  వేసి  ధన్యులుగా మిగిలి పొండి.   ఆ ఆలోచనే మీకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చి అన్నిటా విజయాలు ఇస్తుంది. అదే భగవంతుడి కృప అని మరువకండి.


Share

Related posts

Today Horoscope: ఆగస్టు 24 – శ్రావణమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma

దీపావళి నాడు ఏ నూనెతో దీపారాధన చేయాలి ?

Sree matha

Today Horoscope జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha