Nowruz: నౌరూజ్ అనేది ఇరానీయన్ నూతన సంవత్సరం పేరు.. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది జరుపుకునే పండుగ. నౌరూజ్ అనే పదాన్ని పెర్షియన్ భాషలో కొత్త రోజు అని అంటారు. మార్చి 20 లేదా 21 తేదీలు నౌరూజ్ పండుగకి ప్రత్యేక తేదీలుగా ప్రకటించారు.అనేక దేశాలలో ఆ రోజుని అధికారిక సెలవుదినంగా కూడా ప్రకటించారు.మూడువేల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి పండుగ ఇది. ఇది ఇరానియన్ క్యాలెండర్లో మొదటి నెల గా ప్రకటిస్తారు.

ఈ పండుగ ప్రత్యేకంగా మనిషి యొక్క జన్మను మరియు పునర్జన్మను స్పృహ మరియు శుద్ధికరణతో ప్రకృతి యొక్క స్వచ్ఛమైన ఆత్మతో అతని హృదయం యొక్క పరివర్తనను నొక్కి చెప్పడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. భారతదేశంలో కూడా అఖండ భారత దేశంలో చైత్రమాసం తొలిరోజు లేదా చైత్ర శుద్ధ పాడ్యమి ఇదే ఉగాది లేదా యుగాది పండుగ రోజు.దీనిని హిందూ నూతన సంవత్సరం అంటారు. ప్రాథమికంగా ప్రకృతికి సంబంధించిన వేడుక. ప్రకృతి ఎదుగుదల,ఉల్లాసం,పచ్చదనం,మరియు ఉత్సాహం యొక్క పురాతన దృశ్యాన్ని అందిస్తోంది. పురాతన సాంప్రదాయాలు మరియు ఆచారాలు వంటివి నౌరూజ్ ఇరాన్లోనే కాకుండా ఇతర పొరుగు దేశాలలో కూడా జరుపుకుంటారు.
భారతదేశంలో పార్సి కమ్యూనిటీ వంటి కొన్ని ఇతర జాతి మరియు భాష సమూహాలు కూడా దీనిని కొత్త సంవత్సరం ప్రారంభంగా జరుపుకుంటారు.నౌరు సమయంలో ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరుస్తారు. అంతేకాకుండా ప్రత్యేక ఆహారాన్ని తయారు చేసుకోవడం మరియు బహుమతులు వంటివి ఇచ్చిపుచ్చుకోవడం బంధువులు మరియు స్నేహితులను ఆహ్వానించడం. ఆ రోజు ప్రజలు గత సంవత్సరాన్ని ప్రతిబింబించే సమయం కొత్త సంవత్సరం కోసం తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఇది వసంతకాలం యొక్క ఆశ మరియు పునరుద్ధరనను స్వీకరించడానికి ప్రజలను ఒకచోట చేర్చడం దీని ప్రత్యేకం.